Prakash Raj: సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ నిలుస్తున్నారు. ముఖ్యంగా ఈయన ఏపీ డిప్యూటీ సీఎం సినీ నటుడు పవన్ కళ్యాణ్ గురించి తరచూ మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజు చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన జాతీయ అవార్డులు, రాజకీయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులోభాగంగా పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి అడుగుపెట్టిన మొదట్లో ప్రజా సమస్యల గురించి పెద్ద ఎత్తున మాట్లాడుతూ వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. అయితే ప్రస్తుతం మాత్రం ఈయన ప్రజా సమస్యలను అసలు పట్టించుకోవడంలేదని తెలుస్తోంది.
ఒక రాజకీయ నాయకుడిగా తరచూ వివిధ రకాలుగా మాట్లాడటానికి ఇదేం సినిమా కాదు.అధికారంలో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించకుండా సమయం ఎందుకు వృథా చేస్తున్నారు? అని ప్రశ్నించారు. తిరుపతి లడ్డూ వివాదంపై మాట్లాడుతూ.. సనాతన ధర్మానికి తాను వ్యతిరేకిని కాదనన్నారు. అది చాలా సున్నితమైన అంశమన్నారు. భక్తుల మనోభావాలకు సంబంధించిందని కాబట్టి, ఇలాంటి వాటి గురించి మాట్లాడేటప్పుడు పక్కా ఆధారాలతో మాట్లాడటం ఉత్తమం అని తెలిపారు.
లడ్డు తయారీలో నిజంగానే కల్తీ జరిగి ఉంటే ఇప్పటివరకు ఎందుకు బాధితులకు శిక్ష వేయలేదు అంటూ ఈయన ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ గురించి ప్రకాష్ రాజు మాట్లాడటం ఇది మొదటిసారి కాదు గతంలో కూడా వీరిద్దరి మధ్యపలు విషయాల గురించి పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకున్నాయి. తాజాగా మరోసారి పవన్ కళ్యాణ్ గురించి ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.