KTR: ఆ భూములను ఎవరు కొనొద్దు…కొన్నా వెనక్కి తీసుకుంటాం… హెచ్చరించిన మాజీ మంత్రి కేటీఆర్!

KTR: మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ప్రకటన చేశారు. కంచ గచ్చిబౌలి భూములను ఎవరూ కొనద్దని కోరారు. ఒకవేళ కొన్నా తాము అధికారంలోకి రాగానే వెంటనే ఆ భూములను వెనక్కి తీసుకుంటాము అంటూ కేటీఆర్ తెలిపారు. హెచ్ సియుకి చెందిన 400 ఎకరాలకు సంబంధించి ఎవరైనా భూములను కొనుగోలు చేసిన వారు నష్టపోతారని ఆ 400 ఎకరాల నుంచి సెంటు భూమి కూడా పక్కకు వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు.

మరొక మూడు సంవత్సరాలలో తిరిగి అధికారంలోకి మేమే వస్తాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఆ భూములన్నింటినీ వెనక్కి తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఇలా ఆ 400 ఎకరాలలో అతిపెద్ద ఈకో పార్క్ నిర్వహిస్తామంటూ కేటీఆర్ తెలిపారు.పచ్చని చెట్లను నరకొద్దని విద్యార్థులు నిరసనలు చేస్తుంటే, మంత్రులు వాళ్లకు దైర్యం ఇవ్వాల్సింది పోయి వాళ్ళని గుంట నక్కలు, పెయిడ్ ఆర్టిస్టులు అని అవమానపరుస్తున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన అంటూ మాట్లాడుతున్నారు అయితే పేరుకే ప్రజా పాలన అని ప్రజాస్వామ్యం స్ఫూర్తి ఎక్కడ కనిపించలేదని కేటీఆర్ తెలిపారు. మేము అధికారంలో ఉన్నప్పుడు.హైదరాబాద్ కు గ్రీన్ సిటీ అవార్డు వచ్చిందని… కోట్ల మొక్కలు నాటి హరిత విప్లవానికి తెరలేపామనీ కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ భూమి అయితే దొంగలాగా ఎందుకు పోతున్నారని కేటీఆర్ ప్రశ్నించారు.

ప్రభుత్వ భూములు ప్రజలవని.. సీఎం ధర్మకర్త మాత్రమేనని చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మా పోరాటం కూడా ఆగదని కేటీఆర్ హెచ్చరించారు. అయితే రేవంత్ రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమిని పూర్తిగా చదును చేయిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు కానీ 400 ఎకరాల అటవీ ప్రాంతాన్ని నాశనం చేస్తే ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయని విద్యార్థులు సెలబ్రిటీలు ఇతర రాజకీయ నాయకులు కూడా ప్రభుత్వ తీరును పూర్తిస్థాయిలో తప్పుపడుతున్నారు.