Paritala Ravi: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మత్రి దివంగత నేత పరిటాల రవి హత్య గురించి ఆయన సతీమణి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా పరిటాల సునీత మీడియా సమావేశంలో మాట్లాడారు. గత కొద్ది రోజులుగా రామగిరిలో టీడీపీ వర్సెస్ వైసిపి అనే విధంగా గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ గొడవలపై స్వయంగా జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ తానే స్వయంగా రామగిరి కి వస్తానని తెలియజేశారు.
ఇలాంటి తరుణంలోనే పరిటాల సునీత మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరిటాల రవి హత్య గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.నా భర్త పరిటాల రవి హత్యలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి కూడా పాత్ర ఉందని ఆరోపించారు.ఆరోజు సీబీఐ జగన్ ను కూడా విచారించిందని తెలిపారు. టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలి అంటూ సునీత అన్నారు.
ప్రశాంతంగా ఉన్న అనంతపురం జిల్లాలో తోపుదుర్తి బ్రదర్స్ ఫ్యాక్షన్ రెచ్చగొడుతున్నారని ఈమె తెలిపారు. ఓబుల్ రెడ్డి, మద్దెల చెరువు సూరి కుటుంబాలను ఇందులోకి లాగుతున్నారు. గంగుల భానుమతి, కనుముక్కల ఉమాకు ఇదే నా విజ్ఞప్తి.. ఫ్యాక్షన్ కారణంగా మన మూడు కుటుంబాలు నష్టపోయాయి. మన కుటుంబాలు దీని నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది.
ఇలా ప్రశాంతంగా ఉన్నటువంటి నియోజకవర్గంలో తోపుదుర్తి బ్రదర్స్ ఫ్యాక్షన్ రెచ్చగొడుతూ చలి కాపుకుంటున్నారని సునీత విమర్శలు చేశారు.తోపుదుర్తి సోదరులు ఏది చెబితే అదే జగన్ మాట్లాడుతున్నారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన మీరు వాస్తవాలు తెలుసుకోరా అంటూ ఈమె జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.జగన్ మోహన్ రెడ్డికి శుక్రవారం కలిసొచ్చినట్లుంది.. అందుకే శుక్రవారం రోజు పాపిరెడ్డిపల్లికి వస్తానంటున్నారు అంటూ సునీత ఎద్దేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు సూట్ కేసులో కాస్త బట్టలు కూడా ఎక్కువ పెట్టుకొని రావాలని తెలిపారు.ఇక్కడ లింగమయ్యతోపాటు మీ పార్టీ బాధితులను కూడా పరామర్శించాలి. తోపుదుర్తి బ్రదర్స్ వల్ల ఐదేళ్లలో మీ పార్టీ వారు చాలా మంది నష్టపోయారు. వారిని కూడా జగన్ పరామర్శిస్తే బాగుంటుంది అంటూ సునీత జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు.