మన భారతీయ సంస్కృతిలో వాస్తు శాస్త్రానికి ఎలా ఉంది. భారతీయుల జీవన విధానంలో వాస్తు శాస్త్రం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇంటి నిర్మాణం దగ్గర నుండి ఇంట్లో ఉన్న వస్తువులు అవ్వచ్చుకునే వరకు వాస్తు ప్రకారం అన్ని క్రమబద్ధంగా వాస్తు నియమాలు పాటిస్తూ చేయటం వల్ల కలుగుతాయి. వాస్తు నియమాలను పాటించకుండా ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల ఇంటిని ఇంట్లో ఉన్న వస్తువులను వాస్తు ప్రకారం అమర్చుకోవటమే కాకుండా మన రోజువారి జీవితంలో చేసే ప్రతి పని కూడా వాస్తు నియమాలను పాటిస్తూ చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా భోజనం చేసే సమయంలో కూడా కొన్ని వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలి. భోజనం చేసే సమయంలో పాటించవలసిన వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
• అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటుంటారు. అందువల్ల అన్నాన్ని ఎప్పుడు దైవంతో సమానంగా భావించాలి. అందువల్ల భోజనం చేసే సమయంలో ఎప్పుడు తూర్పు వైపు భోజనం చేయాలి.
• అలాగే భోజనం చేసే సమయంలో నీటితో నింపిన గ్లాసు ఎప్పుడూ కూడా కుడివైపు ఉండేలా చూసుకోవాలి.
• అలాగే భోజనం చేసే సమయంలో మొదటి ముద్దను దైవానికి ప్రార్థన చేసి పక్కన పెట్టాలి. భోజనం పూర్తయిన తర్వాత ఆ మొదటి ముద్దను పశుపక్షాదులకు ఆహారంగా పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సిరిసంపదలకు ఎప్పుడు లోటు ఉండదు.
• అలాగే చాలామంది భోజనం తర్వాత ఆ కంచంలోని చేతులు కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో దరిద్రదేవత తాండవిస్తుంది.
• అలాగే ఎప్పుడు శుభ్రమైన ప్రదేశంలోనే భోజనం చేయాలి.. లేదంటే అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది.
• పచ్చని ఆకులో భోంచెయ్యడం శుభప్రదంగా పరిగణిస్తారు. అంతే కాకుండా ఆరోగ్యానికి కూడ మంచిది.
• చాలామంది వెండి పళ్లెంలో భోజనం చేస్తూ ఉంటారు. అలా వెండి పళ్లెంలో భోజనం చేయాలనుకునేవారు ఆ పళ్లెం మధ్యలో బంగారంతో చేసిన బొట్టు తప్పనిసరిగా ఉండాలి.
• మరొక ముఖ్యమైన నియమం ఏమిటంటే భోజనం చేసిన వెంటనే నిద్రకు ఉపక్రమించడం అశుభం. అలా చేయటం దరిద్రానికి సంకేతం.