Pradeep: పెళ్లి వార్తల పై స్పందించిన యాంకర్ ప్రదీప్… క్రికెటర్ తో పెళ్ళంటూ?

Pradeep: ప్రదీప్ మాచిరాజు పరిచయం అవసరం లేని పేరు. ఇండస్ట్రీలో యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ప్రదీప్ అనంతరం పలు సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఇలా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయనకు ఏకంగా హీరోగా కూడా సినిమా అవకాశాలు వచ్చాయి. ఈయన 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి ఆదరణ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్న ప్రదీప్ మరొక సినిమా విడుదల కాలేదు.

ఇలా తదుపరి సినిమా చాలా ఆలస్యమైందనే చెప్పాలి. అయితే త్వరలోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా ద్వారా ప్రదీప్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ప్రదీప్ పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చింది. ప్రదీప్ పెళ్లి వయస్సు దాటిపోయిన ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉన్న నేపథ్యంలో ఈయన పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

ప్రదీప్ ఓ ప్రజా ప్రతినిధిని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలపై ప్రదీప్ స్పందించారు. సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. తనకు కెరియర్ పరంగా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. చాలా టార్గెట్స్ ఉన్నాయి. వాటినీ చేరుకోవడానికి నాకు కాస్త ఆలస్యం అవుతుందని తెలిపారు. ప్రస్తుతం తాను పెళ్లి గురించి ఆలోచించలేదని నా పెళ్లి గురించి వచ్చే వార్తలన్నీ అవాస్తవమని తెలిపారు.

ఇలా నా పెళ్లి గురించి వచ్చే వార్తలన్నింటినీ నేను కూడా వింటూ ఉన్నాను ముందు ఒక బిజినెస్ ఉమెన్ కూతురితో నా పెళ్లి జరుగుతుందన్నారు తర్వాత ఓ ప్రజా ప్రతినిధితో పెళ్లి అంటున్నారు. ఇక క్రికెట్ తో పెళ్లి అని ప్రచారం చేస్తారేమో అంటూ సరదాగా ఈయన తన పెళ్లి గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.