శాస్త్ర ప్రకారం పూజలో దేవుడికి చక్కెర నైవేద్యంగా సమర్పించటం మంచిదేనా..?

మన హిందూ సంప్రదాయంలో పూజ కార్యక్రమాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలోని ప్రజలందరూ ప్రతిరోజు ఇంట్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఇలా పూజలు చేసే సమయంలో దేవుడి ఎదుట దీపాలు వెలిగించడమే కాకుండా దేవుళ్లకు నైవేద్యం కూడా సమర్పిస్తూ ఉంటారు. సాధారణంగా పండగ వేళల్లో లేదా ఏదైనా ప్రత్యేక సందర్భాలలో ఇంట్లో చేసిన వంటకాలను దేవుడికి నైవేద్యంగా అర్పించిన తర్వాతనే కుటుంబ సభ్యులందరూ భోజనం చేస్తారు. అయితే మరి కొంతమంది ప్రతిరోజు పూజ సమయంలో దేవుడికి ఏదో ఒక నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇలా దేవుడికి నైవేద్యంగా పెట్టటానికి దద్దోజనం, పులిహోర,పాయసం వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు.

అయితే ప్రస్తుత కాలంలో పనుల కోసం ప్రజలు పరిగెడుతూ పూజకు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. అందువల్ల చాలామంది ఇంట్లో ఉన్న పండ్లు ఫలహారాలను దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తూ ఉంటారు. అయితే మరికొంతమంది పండ్లు అందుబాటులో లేకపోతే ఇంట్లో ఉన్న చక్కెర బెల్లం వంటి వాటిని దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఇలా చక్కెర బెల్లం వంటి వాటిని దేవుడికి నైవేద్యంగా పెట్టడం ఆ శుభంగా కొంతమంది భావిస్తూ ఉంటారు. శాస్త్ర ప్రకారం చక్కెర దేవుడికి నైవేద్యంగా పెట్టడం మంచిదా? కాదా?అన్న విషయాల గురించి వేద పండితులు వివరించారు.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ప్రసాదం తయారుచేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించే సమయం లేనప్పుడు ఇలా చక్కెరను నైవేద్యంగా పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పూజా సమయంలో దేవుళ్లకు పంచదార పలుకులు నైవేద్యంగా సమర్పించడం ద్వారా అది ప్రసాదంగా మారిపోతుందని వేద పండితులు చెబుతున్నారు.కాబట్టి చక్కెర నైవేద్యంగా సమర్పించడం మనకు ఎటువంటి అనుమానం అక్కర్లేదని కూడా వేద పండితులు చెబుతున్నారు. పంచదార నైవేద్యంగా సమర్పించడంలో ఎటువంటి తప్పులేదని ప్రజలు గ్రహించాలి . ఈ చక్కెరను నైవేద్యంగా ఎప్పుడు సమర్పించాలంటే మనకు అందుబాటులో ఏ వండ లేని పరిస్థితులలో ఇలా చేయడం మంచిది.