Venu Swamy: కృష్ణ మరణానికి మహేష్ బాబు కారణం… బాంబు పేల్చిన వేణు స్వామి!

Venu Swamy: వేణు స్వామి నిత్యం ఏదో ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలలో నిలుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఈయన సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోతారని చెప్పారో ఆ క్షణమే అందరి దృష్టిని ఆకర్షించారు అయితే అప్పట్లో విమర్శలు ఎదుర్కొన్న చివరికి వేణు స్వామి చెప్పింది నిజం కావడంతో ఈయన ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇక అప్పటినుంచి వేణు స్వామిని నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది.

ఇలా వేణు స్వామి పాపులర్ కావడంతో ఈయన తరచూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి జాతకాలను అలాగే రాజకీయ నాయకుల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలిచారు. కొన్నిసార్లు ఈయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ఈయనపై కేసులు కూడా నమోదు చేశారు. ఇలా తన గురించి ఎన్ని విమర్శలు వచ్చినా వేణు స్వామి మాత్రం తన ధోరణి మార్చుకోలేదు తరచూ ఏదో ఒక హీరో గురించి రాజకీయ నాయకుడు గురించి మాట్లాడుతూనే ఉన్నారు.

తాజాగా ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మాట్లాడారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ మరణించడానికి తన కొడుకు మహేష్ కారణమంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా వేణు స్వామి మాట్లాడుతూ తాను 1995వ సంవత్సరం నుంచి కృష్ణ గారి ఇంట్లో పూజలు చేస్తూ ఉన్నానని తెలిపారు. అయితే 2020 సంవత్సరంలో ఓసారి పూజ చేయడానికి వెళ్ళాను అప్పుడు విజయనిర్మల గారు ఇంట్లో వారి జాతకాలు గురించి అడిగారు. తాను ఉన్నది ఉన్నట్టు నిర్మొహమాటంగా చెబుతాను అయితే త్వరలో ఈ ఇంట్లో వరుస మరణాలు జరుగుతాయని చెప్పడంతో వారు అప్పటినుంచి నన్ను పూజలకు పిలవలేదని తెలిపారు.

నేను జాతకం చెప్పిన రోజున మహేష్ బాబు జాతకం శని గ్రహంలోకి ప్రవేశిస్తుంది. ఈ శని గ్రహంలోకి ప్రవేశించటం వల్ల తన తండ్రికి ప్రమాదమని చెప్పాను. జనవరి 16 తర్వాత ఈ ఇంట్లో చెడు జరుగుతుందని తాను అప్పుడే చెప్పాను. అయితే నేను చెప్పిన విధంగానే ఆ ఇంట్లో వరుస మరణాలు జరిగాయని మహేష్ బాబు గ్రహస్థితి కారణంగానే కృష్ణ గారికి కూడా మరణం సంభవించింది అంటూ వేణు స్వామి చెప్పారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో సంచలనంగా మారడమే కాకుండా మహేష్ బాబు అభిమానులు వేణు స్వామి పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.