Mokshagna: మోక్షజ్ఞ సినిమాకు ఇప్పటికైనా మోక్షం వచ్చేనా… రంగంలోకి మరో డైరెక్టర్?

Mokshagna: నందమూరి వారసుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలయ్య కుమారుడిగా అందరికీ సుపరిచితమైన మోక్షజ్ఞ ఇప్పటికే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉండగా ఈయన ఎంట్రీ మాత్రం చాలా ఆలస్యమైంది. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞను పరిచయం చేస్తూ ఇటీవల సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. దీంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక ఈ సినిమా తదుపరి షూటింగ్ పనులను ప్రారంభిస్తుందని అందరూ భావించారు కానీ అనుకోని విధంగా ఈ సినిమా కాస్త వాయిదా పడింది కొన్ని కారణాల వల్ల ఈ సినిమా నుంచి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తప్పుకున్నారు. ఇలా ప్రశాంత్ వర్మ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ఈ సినిమా మరికాస్త ఆలస్యం అవుతుంది .ఈ క్రమంలోనే మరొక డైరెక్టర్ కోసం చిత్ర బృందం వేట మొదలుపట్టారు.

ఈ క్రమంలోనే మోక్షజ్ఞ సినిమా కోసం మరొక డైరెక్టర్ రంగంలోకి దిగారని తెలుస్తోంది.మోక్షజ్ఞ తొలి సినిమాకు వెంకీ అట్లూరి దర్శకుడిగా ఎంపిక అయ్యారని సమాచారం. వెంకీ అట్లూరి ఇప్పటికే ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’, ‘సార్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మోక్షజ్ఞ కోసం ప్రత్యేకంగా ఒక స్టోరీ సిద్ధం చేసినట్లు సమాచారం. బాలకృష్ణ కూడా ఈ సినిమా స్టోరీ విన్నారని తెలుస్తోంది. తండ్రిగా ఒక హీరోగా బాలయ్యకు ఈ సినిమా కథ నచ్చితే వెంటనే సినిమా షూటింగ్ పనులు ప్రారంభం అవుతాయని తెలుస్తుంది.

ఈ సినిమాలో మోక్షజ్ఞ లవర్ బాయ్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. ఇలా మోక్షజ్ఞ సినిమాకు సంబంధించి తరచూ ఏదో ఒక వార్త వస్తున్నప్పటికీ ఈ సినిమా మాత్రం పట్టాల పైకి వెళ్లకపోవడంతో అసలు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ఎప్పుడు మోక్షం లభిస్తుందా అంటూ నందమూరి అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. మరి వెంకీ అట్లూరి అయిన నందమూరి హీరోని సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీకి లాంచ్ చేస్తారా లేదా అనేది తెలియాల్సిందే.