Nagababu: ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణస్వీకారం… అభినందనలు తెలిపిన చిరు దంపతులు!

Nagababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి సభ్యుడిగా కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేసారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబుతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీ శాసనమండలిలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడంతో వాటిని భర్తీ చేశారు. అయితే జనసేన పార్టీ నుంచి నాగబాబు ఎమ్మెల్సీగా ఎంపిక కావడం జరిగింది. ఈయన ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఇక ఈయన ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే మొదటిసారి తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు.

గతంలో పవన్ కళ్యాణ్ సైతం డిప్యూటీ సీఎం, మంత్రిగాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి తన అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లి తన ఆశీర్వాదం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే నాగబాబు కూడా తన తమ్ముడి మాదిరిగానే మొదటిసారి ఎమ్మెల్సీగా తన అన్నయ్య ఇంటికి వెళ్లి అక్కడ తన అన్నయ్య వదిన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక ఎమ్మెల్సీగా నాగబాబు ఎంపిక కావడంతో చిరంజీవి పూలమాలతో తన తమ్ముడిని సత్కరించారు.

ఇకపోతే తన వదిన సురేఖ నాగబాబుకు ఒక కానుకగా ఇచ్చారు. గతంలో ఈమె పవన్ కళ్యాణ్ కి కూడా ఇలా కానుకగా ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన తమ్ముడు నాగబాబుకు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ విధాన పరిషత్ సభ్యుడి (MLC) గా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో – అన్నయ్య, వదిన అంటూ పోస్ట్ చేసారు.

ఇలా చిరంజీవి సురేఖను కలిసిన అనంతరం నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ని కూడా కలిశారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవడంతో మెగా అభిమానులు జన సేన కార్యకర్తలు కూడా ఎమ్మెల్సీ నాగబాబుకు అభినందనలు తెలియజేస్తున్నారు.