వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో శంఖాన్ని ఉంచి పూజించడం వల్ల శుభం జరుగుతుంది. అలాగే ఇంట్లో శంఖం శబ్దం వినిపించటం వల్ల ఆ ఇంటి సమస్యలలో మార్పు వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. శంఖాలు చాలా రకాలుగా ఉంటాయి. వీటిలో కొన్ని రకాల శంఖాలను పూజిస్తారు. మరికొన్ని రకాల శంఖాలను పూరించడానికి ఉపయోగిస్తారు. అయితే శంఖాలను పవిత్రంగా భావిస్తారు. అందువల్ల పూజా కార్యక్రమాలలో శంఖాలను ఉంచి పూజించడమే కాకుండా ఏదైనా ముఖ్యమైన పనులు ప్రారంభించే ముందు కూడా శంఖారావం చేస్తారు. అయితే ఇంట్లో ఇలా శంఖాన్ని పూరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం.
పురాణాల ప్రకారం శంఖం సముద్రం మథనం నుంచి ఉద్భవించింది చెబుతారు. అంతే కాకుండా శంఖం, లక్ష్మీదేవి తోబుట్టువులుగా భావిస్తారు. అంతేకాకుండా శంఖం విష్ణుమూర్తికి చాలా ఇష్టమైనది. శంఖాన్ని ఇంట్లో ఉంచి పూజిస్తారు. శంఖం ఉన్న ఇంట్లో కుటుంబ సభ్యులు కలహాలు లేకుండా కలిసిమెలిసి ఉంటారు. అలాగే ఇంట్లో శంఖాన్ని పూరించడం వల్ల కూడా వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు. అలాగే ఇలా శంకర్ ని పూరించడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. శంఖాన్ని పూరించడం వల్ల మీ ఊపిరితిత్తుల, శ్వాసకోశ వ్యాధులను న్యాయం చేస్తుంది. ప్రతీ రోజు రెండు నుంచి నాలుగు సార్లు శంఖం ఊదడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.
ఇంట్లో శంఖాన్ని ఊదడం ద్వారా ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ వల్ల కుటుంబ సభ్యులు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. పరమ పవిత్రంగా భావించే ఈ శంఖాన్ని ఊదడంవల్ల ఇల్లు, ఇంటి పరిసరాలు కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. శంఖం వదినప్పుడు దాని నుండి ఓంకారం శబ్దం ఉద్భవిస్తుంది. ఈ ఓంకార శబ్దం వల్ల వాతావరణ సానుకూల శక్తి తో నిండి ఉంటుంది. దీని ద్వారా చుట్టూ వ్యాపించిన ప్రతికూల శక్తిని కూడా నాశనం చేస్తుంది. శంఖంలో నీటిని నింపి ఇంట్లోనే ప్రతి భాగంలో చల్లాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తి దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా శంకర్ ని నీటితో నింపి పూజించటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడు మనపై ఉంటుంది.