వంట గదిలో ఈ వస్తువులను పెట్టారా.. ఏరి కోరి సమస్యలను తెచ్చుకున్నట్టే?

వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఎన్నో విషయాలను తప్పకుండా పాటిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే మన ఇంటి నిర్మాణం మొదలుపెట్టిన సమయం నుంచి ఇంటిలో అలంకరించుకునే ప్రతి ఒక్క వస్తువు వరకు కూడా వాస్తు శాస్త్రాన్ని తప్పనిసరిగా పాటిస్తాము. ముఖ్యంగా వంటగది విషయంలో ఇలాంటి నియమాలను ఎక్కువగా పాటిస్తారు.వంట గదిలో ప్రతి ఒక్కటి సరైన దిశలో వాస్తు శాస్త్ర ప్రకారం ఉంటే ఆ ఇల్లు మొత్తం సుఖసంతోషాలతో ఉంటారు. అలా కాకుండా వంటగదిలో పొరపాటున కూడా కొన్ని రకాల వస్తువులను పెట్టడం వల్ల సమస్యలను మనమే కొని తెచ్చుకున్నట్టు అవుతుంది.

ఈ మధ్యకాలంలో చాలామంది వంటగదిలో కూడా చిన్నపాటి అద్దాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వంట గదిలో అద్దం ఉండడం మంచిది కాదు వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం ఉండటం వల్ల ఆర్థిక అభివృద్ధి ఆగిపోతుంది.ఇక ఇంటిని మొత్తం శుభ్రం చేసే చీపురును వంట గదిలో ఎప్పుడు పెట్టకూడదు ఇల్లు శుభ్రం చేసిన తర్వాత చీపురు ఎవరికీ కనిపించకుండా ఉండేలా పెట్టాలి. ఇక చాలామంది వంటగదిలో విరిగిపోయిన,తుప్పు పట్టిన పాత్రలను ఉపయోగిస్తూ వాటిని వంట గదిలోనే పెడుతుంటారు ఇలా పెట్టడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తుంది

ఇక వంట గదిలో ఎల్లప్పుడూ పసుపు ఉప్పు బియ్యం నిండుగా ఉండాలి. ఈ డబ్బాలు ఎప్పుడు ఖాళీ కాకూడదు.అదేవిధంగా వంట గదిలో పాడైపోయిన ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం పరమ దరిద్రం ఇలా ఉండటం వల్ల పేదరికం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే వంట గదిలో ఈ వస్తువులు లేకుండా జాగ్రత్త పడటం వల్ల ఇంటి సభ్యులందరూ సంతోషంగా ఉండటమే కాకుండా ఇంట్లో ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది.