నేచురల్ స్టార్ నాని మళ్లీ మాస్ అవతారంలో రాబోతున్న సినిమా ప్యారడైజ్. ‘దసరా’ తరువాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తుండటంతో అంచనాలు రెట్టింపయ్యాయి. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న ఈ యాక్షన్ డ్రామా, అత్యంత హింసాత్మకంగా ఉండబోతోందని మేకర్స్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. నాని లుక్‌తోపాటు విడుదలైన వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పటివరకు షూటింగ్ మొదలవలేదు కానీ… మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా కథలో నాని తల్లి పాత్ర కీలకమనే విషయం తెలిసిందే. “రక్తంతో పెంచిన కొడుకు” అనే డైలాగ్ కథలో మదర్ ఎమోషన్ ఎలా ఉండబోతుందో చెబుతోంది. అందుకే ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా ఒక శక్తివంతమైన నటిని ఎంపిక చేయాలన్న ఉద్దేశంతో టీమ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
సినిమా టీమ్ మొదట రమ్యకృష్ణను సంప్రదించిందని టాక్. కానీ ఆమె కొన్ని కారణాలతో ఈ ఆఫర్‌ను తిరస్కరించిందని సమాచారం. దీంతో టీమ్ హిందీ, మరాఠీ సినిమాల వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మరాఠీ నటి సోనాలి కులకర్ణి పేరు చర్చల్లో ఉంది. ఆమె ఇప్పటికే పలు బాలీవుడ్ హిట్ చిత్రాల్లో నటించగా, ఇప్పుడు ఈ చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టనుందని వినిపిస్తోంది.
అయితే మేకర్స్ అధికారికంగా ఇప్పటి వరకు ఎవరినీ కన్ఫర్మ్ చేయలేదు. లుక్ టెస్టులు జరుగుతున్నాయని సమాచారం. మరోవైపు, టాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ అయితే అంచనాలు పెరిగిపోతాయని, కరెక్ట్ ఎమోషన్ అందించలేరని భావించి బయట ఇండస్ట్రీ నటి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ఈ మదర్ క్యారెక్టర్ ఎవరిదో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.