అన్నంతో పాటు ఇవి తీసుకుంటే షుగర్ బారిన పడటం పక్కా.. షాకింగ్ విషయాలు రివీల్!

సౌత్ ఇండియాలో అన్నం తినే వాళ్ల సంఖ్య ఎక్కువ అనే సంగతి తెలిసిందే. మన దేశంలో మధుమేహం బారిన పడేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా అన్నంలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ అధికంగా ఉండటం వల్ల షుగర్ బారిన పడే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. 5 రకాల ఆహారాలను అన్నంతో కలిపి తీసుకోవడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా కలుగుతుందని చెప్పవచ్చు.

అన్నం, రోటీ కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి లాభం కంటే నష్టం ఎక్కువగా కలిగే ఛాన్స్ అయితే ఉంటుంది. ఉబ్బరం, గ్యాస్ మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను ఇది కలిగిస్తుంది. అన్నంతో బంగాళదుంపలు కలిపి తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి నష్టం కలుగుతుంది. ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులను రాకూడదని కోరుకునే వాళ్లు హెల్త్ విషయంలో కేర్ తీసుకోవాలి.

అన్నం, పండ్లను కలిపి తింటే మీ జీర్ణక్రియ దెబ్బతిని కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని చెప్పవచ్చు. అందువల్ల అన్నం, పండ్లు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి తీరని నష్టం చేకూరుతుంది. కొందరికి ఆహారం తిన్న వెంటనే టీ తాగే అలవాటు అయితే ఉంటుంది. ఈ అలవాటు కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. పప్పు-బియ్యం, సలాడ్ ఒక అద్భుతమైన భోజనం కాగా జీర్ణక్రియ సరిగా లేని వారు అన్నం, సలాడ్ కలిపి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

డయాబెటిస్ అంటే, శరీరం తగినంత ఇన్సులిన్‌ను తయారు చేయకపోవడం వల్ల లేదా దానిని సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే వ్యాధి అని చెప్పవచ్చు. అతిమూత్రం (పాలీయూరియా), దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, చేతులు లేదా అడుగులలో మొరగడం లేదా మూర్ఛించడం కూడా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయని చెప్పవచ్చు.