Lakshmi Parvathi: ఎన్టీఆర్ నా చెప్పు చేతుల్లో ఉండేవారు… అందుకే కుట్ర చేశారు: లక్ష్మీపార్వతి

Lakshmi Parvathi: సీనియర్ నటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చివరి రోజులలో ఈమెను పెళ్లి చేసుకోవడంతో ఈమె ఎన్టీఆర్ కి తోడుగా ఆయన బాగోగులన్నింటిని చూసుకుంటూ ఉండేవారు అయితే ఈమెను ఎన్టీఆర్ భార్యగా నందమూరి కుటుంబ సభ్యులు మాత్రం అంగీకరించలేదు.

లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ భార్య హోదాతో రాజకీయాలలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకొని, రాజకీయాలలో చురుకుగా పాల్గొనక పోయిన తన ఉనికిని మాత్రం కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈమె తెలుగుదేశం పార్టీకి కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్న సంగతి తెలిసిందే. నిత్యం తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీపార్వతి ఎన్టీఆర్ గురించి పలు విషయాలను వెల్లడించారు.చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వేంకటేశ్వర రావు ఇద్దరూ ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచారని చెపుతూ, నాడు టీడీపీలో ఆవిదంగా అధికార మార్పిడి ఎందుకు జరిగిందో కూడా తెలియజేశారు.

ఇలా ఎన్టీఆర్ మీద కుట్ర జరగడానికి కారణం ఎన్టీఆర్ గారిని తాను తన చెప్పు చేతుల్లో పెట్టుకోవడమే కారణమని ఈమె తెలియజేశారు.ఎన్టీఆర్‌గారు నా చెప్పు చేతలలో ఉండేవారు. కనుక మంత్రి పదవి తీసుకోవాలంటే అదేం పెద్ద కష్టం కాదు నాకు. నాకు ఎన్టీఆర్‌ పార్టీలో కీలక పదవి అప్పగించారు. రెండుసార్లు మంత్రి పదవి కూడా ఇస్తామన్నారు. కావాలంటే మోహన్ బాబుని అడగండి. చెపుతారు. ఎన్టీఆర్‌ నా చెప్పు చేతలలో ఉన్నారనే అసూయ, ద్వేషంతోనే అందరూ కలసి కుట్ర చేశారనీ లక్ష్మీపార్వతి వెల్లడించారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.