Ntr -Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యం పై నటుడు ఎన్టీఆర్ కీలక ప్రకటన!

Ntr -Kodali Nani: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కొడాలి నాని గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే ఈయన ఉన్నఫలంగా గుండెల్లో నొప్పి రావడంతో వెంటనే హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆయనకు గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించగా గుండెలో మూడు కవాటాలు పూర్తిగా బ్లాక్ కావడంతో వెంటనే బైపాస్ సర్జరీ చేయాలి అంటూ డాక్టర్లు తెలిపారు.

ఈ క్రమంలోనే మరింత మెరుగైన చికిత్స కోసం కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబైకి తీసుకు వెళ్లిన విషయం తెలిసిందే.ప్రముఖ డాక్టర్ పాండ కొడాలి నానికి సర్జరీ చేసారు. ఈ ఆపరేషన్ విజయవంతం అయిందని డాక్టర్ల బృందం తెలిపింది.. ప్రస్తుతం కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని మరో మూడు రోజులపాటు కొడాలి నాని వైద్యుల పర్యవేక్షణలో ఉండబోతున్నారు.

ఇక ఈయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని అయితే ఎప్పటికప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుంటూ ఒకవైపు డాక్టర్లతో మాట్లాడటం మరోవైపు కుటుంబ సభ్యులకు కూడా భరోసా కల్పించారు. సర్జరీ సక్సెస్ అయిన తర్వాత కొడాలి నాని స్పృహలోకి రాగానే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా కొడాలి నాని ప్రాణ స్నేహితుడైన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం కొడాలి నాని ఆరోగ్యం పై స్పందించారు.కొడాలి నాని త్వరగా కోలుకోవాలని అయన తెలిపారు. నాని కుటుంబసభ్యులతో మాట్లాడిన ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.. దిగులు పడవద్దని త్వరలోనే మళ్లీ మాములు మనిషిలా అవుతాడని కుటుంబసభ్యులకు ఎన్టీఆర్ దైర్యం చెప్పారు.

ఇక ఎన్టీఆర్ కొడాలి నాని మధ్య చాలా మంచి అనుబంధం ఉంది. ఒకానొక సందర్భంలో ఎన్టీఆర్ కొడాలి నానితో ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతూ నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు కానీ నేను ఏ స్నేహితుడి కైనా ప్రాణాలు ఇవ్వాల్సి వస్తే అది కొడాలి నాని కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటానంటూ గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వెల్లడించారు.