Y.S.Sharmila: వైయస్ అవినాష్ రెడ్డి పై షర్మిల సంచలన వ్యాఖ్యలు… సునీత ప్రాణాలకు ముప్పు అంటూ!

Y.S. Sharmila: వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య, తదనంతరం జరిగిన, పరిణామాల గురించి ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసుల ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వైయస్ అవినాష్ రెడ్డి ప్రస్తుతం బెయిలు మీద బయట ఉన్నారు.

ఇలా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి వైయస్ అవినాష్ రెడ్డి బయట తిరుగుతున్న నేపథ్యంలో ఈ కేసులో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. వైఎస్ వివేకానంద హత్య కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్కొక్కరుగా మరణిస్తున్న నేపథ్యంలో వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత ప్రాణాలకు కూడా ముప్పు ఉందని షర్మిల తెలిపారు.

వైయస్ వివేకానంద రెడ్డి చనిపోయినప్పుడు అక్కడ ఆయన కూతురు సునీత తన అల్లుడి ఎవరూ లేరు ఉన్నది కేవలం అవినాష్ రెడ్డి మాత్రమేనని తెలిపారు. ముందు గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయారని అందరిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఈయన బెయిల్ మీద బయట తిరుగుతూ కేసును తారుమారు చేస్తున్నారని షర్మిల ఆరోపణలు చేశారు.

ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న సీబీఐ అధికారి రాంసింగ్ నే తన ఇంటికి పిలిపించుకుని మరీ అవినాశ్ ఆయనను బెదిరించారని ఆమె ఆరోపించారు. అంతేకాకుండా సునీతనే తన తండ్రిని చంపేసినట్లుగా కేసును మార్చేసి.. దానిపై విచారణాధికారి రాంసింగ్ చేత సంతకాలు పెట్టించారని షర్మిల ఆరోపణలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న వారందరూ మరణించారు.

ఇక అవినాష్ రెడ్డి సునీతని కూడా హత్య చేయించరని గ్యారెంటీ ఏంటి ఆయన బయట ఉంటే సునీత ప్రాణాలకు ముప్పు సునీతకు ఏదైనా జరిగితే తన ఇద్దరు పిల్లల పరిస్థితి ఏంటి అంటూ షర్మిలా ప్రశ్నించారు. ఇలా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రధాన నిందితులుగా చెబుతూ షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.