YS Jagan: వైసీపీ పాలన ముగిసిన తర్వాత రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా, విచారణల ఉధృతి పెరిగింది. ఇప్పటి వరకూ మధ్యస్థాయి నేతలపై మాత్రమే దృష్టి పెట్టిన ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడు కీలక నేతల వైపు మొగ్గు చూపింది. మాజీ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పేర్లు తాజాగా చర్చల్లోకి వచ్చాయి. నెల్లూరులోని రుస్తు ప్రాంతంలో అక్రమంగా క్వార్ట్జ్ గనుల తవ్వకాల ద్వారా వేల కోట్ల రూపాయలు దోచుకున్నారన్న ఆరోపణలతో కాకాని ముప్పుతిప్పలు పడుతున్నారు.
కేవలం గనుల కేసుతోనే కాకుండా, గిరిజనులపై బెదిరింపులు, కులదూషణల ఆరోపణలతో మరో కేసు నమోదు కావడం కాకానిని మరింత సంక్షోభంలోకి నెట్టింది. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ కోర్టులో చిక్కుకురాలేదు. అదే సమయంలో మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి పేరు దర్యాప్తులోకి వచ్చిందని తెలిసింది. అప్పటి మద్యం సంస్థ ఎండీ వాసుదేవ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా మిథున్‌ను కీలకంగా భావిస్తున్నట్టు సమాచారం.
ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరు నేతల అరెస్టు అవకాశాలు పెరుగుతున్నాయి. అయితే వీరిద్దరూ జగన్‌కు అత్యంత సన్నిహితులు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు కావడంతో, రాజకీయంగా ఈ అరెస్టులు వైసీపీకి భారీ దెబ్బ అవుతాయన్న భావన పార్టీ నేతల్లో నెలకొంది.
అందుకే జగన్ స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం. బెయిలు కొరుకుతున్న కోణంలో హైకోర్టు తర్వాత వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయాలన్న ఆదేశాలు పార్టీ లాయర్లకు ఇచ్చినట్టు చెబుతున్నారు. పెద్దఎత్తున ఖర్చైనా లెక్కచేయకుండా టాప్ లీగల్ టీమ్‌ను రంగంలోకి దింపాలని సూచించారట. ఇక పార్టీకి, సామాజిక సమీకరణాలకీ దెబ్బ తగలకుండా ఈ ఇద్దరిని కాపాడుకోవడమే జగన్ లక్ష్యంగా మారిందని అంటున్నారు.