ప్రస్తుత కాలంలో ఎక్కువమందిని గుండె సంబంధిత సమస్యలు వేధిస్తున్నాయి. గుండె ఆరోగ్యం విషయంలో కేర్ తీసుకోని పక్షంలో దీర్ధ కాలంలో ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. గుండె సమస్యలతో బాధ పడేవాళ్లు సాల్మన్, ట్యూనా, ట్రౌట్ వంటి చేపలు తీసుకుంటే మంచిది.
95% లీన్ గ్రౌండ్ బీఫ్ లేదా పోర్క్ టెండర్లాయిన్ తీసుకోవడం ద్వారా కూడా గుండె సమస్యలు దూరమవుతాయి. స్కిన్‌లెస్ చికెన్ కూడా గుండె సమస్యలు రాకుండా చేయడంలో తోడ్పడుతుందని చెప్పవచ్చు. బ్లాక్ బీన్స్, తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు, గింజలు మరియు చిక్కుళ్లు తీసుకోవడం ద్వారా గుండె సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.
సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. అధిక ఫైబర్, అధిక మొక్కల ఆహారం తీసుకోవడం గుండెకు మేలు చేస్తుంది. ఆరోగ్యకరమైన నూనెలు వాడటం ద్వారా గుండె సంబంధిత సమస్యల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు.
తగినంత శారీరక శ్రమ చేయడం ద్వారా గుండె సమస్యల బారిన పడకుండా రక్షించుకోవచ్చు. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న ఆహారంకు దూరంగా దూండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ ఉప్పు ఉన్న ఆహారానికి దూరంగా ఉంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.