Kodali Nani: వైయస్సార్సీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన గత కొద్ది రోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో బాధపడుతూ హైదరాబాదులోని ఏ ఐజి ఆసుపత్రికి వెళ్లారు. అయితే ఈయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని వైద్యులు ప్రకటించడమే కాకుండా వెంటనే బైపాస్ సర్జరీ చేయాలని తెలిపారు.
ఇలా బైపాస్ సర్జరీ కోసం ప్రముఖ కార్డియాలజిస్ట్ పాండే ఈయనకు సర్జరీ నిర్వహించారు. అయితే ముంబైలో ఈయనకు బైపాస్ సర్జరీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈయన సర్జరీ కూడా ఎంతో విజయవంతమైనది. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. అయితే తాజాగా మరోసారి కొడాలి నాని హెల్త్ అప్డేట్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే నాని ఆరోగ్య పరిస్థితిపై వైకాపా జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు స్పందించారు. ఈ మేరకు గురువారం ఈయన మాట్లాడుతూ…రమాకాంత్ పాండే ఆధ్వర్యంలో సుమారు 8 నుంచి 10 గంటల పాటు ట్రీట్మెంట్ జరిగిందని తెలిపారు. ఈ సర్జరీ అనంతరం నాని కొద్ది రోజులపాటు ఐసీయూలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని అన్నారు.
ప్రస్తుతం కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ఆయన శరీరంలోని అన్ని అవయవాలు బాగా స్పందిస్తున్నాయని వైద్యులు ధ్రువీకరించినట్లు హనుమంతరావు పేర్కొన్నారు. అంతేకాకుండా కొడాలి నాని అభిమానులకు మరో షాకింగ్ అప్డేట్ చెప్పారు. ఆయన మరో నెల రోజులపాటు ముంబయిలోనే ఉంటారని అన్నారు.
ఇలా నెలరోజుల పాటు తరచూ చెకప్ కోసం ఇక్కడి నుంచి వెళ్లాలి అంటే ఇబ్బంది అవుతున్న తరుణంలో ఈయన నెల రోజులపాటు ముంబైలోనే ఉండబోతున్నారని తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఆయన అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాని క్షేమంగా ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు.