మాలీవుడ్‌లో హిట్ సినిమా ఎంపురాన్ నిర్మాత గోకులం గోపాలన్‌కు తాజాగా ఈడీ నుంచి ఎదురు దెబ్బ తగిలింది. గోకులం గ్రూప్‌కి చెందిన చెన్నై, కేరళలోని చిట్ ఫండ్ కార్యాలయాలపై ఈడీ (ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) శుక్రవారం ఆకస్మిక దాడులు జరిపింది. కంపెనీకి సంబంధించి విదేశీ మారక ద్రవ్య చట్టం (FEMA) ఉల్లంఘనపై విచారణ చేస్తూ, పలు కీలక పత్రాలు, లావాదేవీల వివరాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
గోకులం కంపెనీపై గతంలోనూ కొన్ని ఆర్థిక అవకతవకల ఆరోపణలు ఉన్నాయి. 2017లో ఐటీ శాఖ దాడులు జరిపి, దాదాపు ₹1000 కోట్ల పన్ను ఎగవేత జరిగిందని ఆరోపించింది. ఇప్పుడు మాత్రం ఈడీ రంగంలోకి దిగడం మరింత సంచలనం రేపుతోంది. కంపెనీ విదేశాలకు నిధులు తరలించిందా? లేదా మినీ లాండరింగ్ లో పాల్గొన్నదా? అన్న కోణంలో విచారణ సాగుతోందట.
కానీ ఈ దాడులకు కొంతమంది భిన్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎంపురాన్ సినిమాలో 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కొన్ని సీన్లు వివాదానికి కారణమయ్యాయి. ఈ అంశం సెన్సార్ బోర్డుకు వెళ్లగా, కొన్ని సన్నివేశాలపై కోతలు విధించారు. అయినా సినిమా చుట్టూ రాజకీయ చర్చ కొనసాగుతోంది. సురేష్ గోపి వంటి నేతలు సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం, రాజ్యసభలో దీని ప్రస్తావన రావడం గమనార్హం.
ఈ నేపథ్యంలో సినిమా వివాదానికి ప్రతీకారంగా ప్రముఖ లీడర్లు ఈడీ దాడులు చేయించారా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. గోపాలన్‌పై ఈ సమయాన ఇలా దాడులు జరగడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ప్రస్తుతం ఈడీ దృష్టంతా గోకులం గ్రూప్ బ్యాంక్ లావాదేవీలు, డిజిటల్ డేటాలపై ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూస్తుంటే, ఎంపురాన్ సినిమాతో మొదలైన వివాదం ఇంకా నిండలేదన్నట్టుగా ఉంది.