KTR: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. సుమారు నాలుగు వందల ఎకరాలలో చెట్లను తొలగించడానికి తెలంగాణ సర్కార్ సిద్ధం కావడంతో అక్కడున్నటువంటి ఎన్నో వన్య ప్రాణులకు ఆవాసం లేకుండా పోతుంది అంతేకాకుండా ఈ పరిస్థితులు ఉష్ణోగ్రతలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి అంటూ ఎంతోమంది తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సైతం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఆ భూమిలో ఎలాంటి పనులు చేయకూడదు అంటూ ఆదేశాలను జారీచేసింది. ఇక ఈ తీర్పుపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ తెలంగాణ సర్కారుపై విమర్శలు కురిపించారు.ఈ క్రమంలోనే కంచ గచ్చబౌలి భూముల వ్యవహారంపై ప్రభుత్వం మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. అందులో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రలు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
ఇప్పుడున్న 400 ఎకరాల్లోనే కాకుండా యూనివర్సిటీ భూములు 1,600 ఎకరాలను కలిపి 2 వేల ఎకరాల్లో అతి పెద్ద ఎకో పార్క్ గా తీర్చిదిద్దాలని ప్రభుత్వాన్ని నిర్ణయం తీసుకుంది అంటూ వెల్లడించారు అయితే ఈ విషయంపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని గ్రీన్ జోన్‌గా ప్రకటించి నగరంలోనే బెస్ట్ ఎకో పార్క్ గా తయారు హెచ్‌సీయూకి కానుకగా ఇస్తామని ప్రకటించిన వెంటనే.. 24 గంటలు తిరగక ముందే 2 వేల ఎకరాల్లో ఎకో పార్క్ అంటూ కాంగ్రెస్ సర్కారు బీరాలు పలుకుతోందని అన్నారు. సుప్రీం ఆదేశాలతో సర్కారుకు దిమ్మతిరిగిందని.. ఎకో పార్క్ తయారు చేయడం అంటే ఏఐ వీడియో తయారు చేసినంత ఈజీ కాదు అంటూ సెటైర్లు వేశారు. ఇక నైట్ సఫారీ అంటే.. రాత్రికి రాత్రే వందల జేసీబీలు, టిప్పర్లతో చొరబడి విధ్వంసం చేయడం కాదని ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.