Roja: అధికారంలో మీ చంద్రబాబు ఉన్నాడు… వైఎస్ షర్మిలకు కౌంటర్ ఇచ్చిన రోజా!

Roja: సాధారణంగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలకు మేలు చేయకపోయినా ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, ఇతర ప్రత్యర్థి పార్టీలో ప్రశ్నించడం సర్వసాధారణం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తి భిన్నం అని చెప్పాలి. అధికారంలో కూటమి ప్రభుత్వము ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయినప్పటికీ ఏపీపీఎస్సీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు కురిపించడం ఎంతో విడ్డూరంగా ఉంది.

తాజాగా షర్మిల మీడియా సమావేశంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి వారందరూ కూడా మరణిస్తున్నారు అవినాష్ బయట ఉంటే సునీత ప్రాణాలకు ముప్పు అంటూ ఈమె మాట్లాడిన వ్యాఖ్యలపై వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా సోషల్ మీడియా వేదికగా స్పందించారు.షర్మిళ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన విషయాలు చూశాం. ఒకరిపై అసూయ, ద్వేషంతో చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి రాజకీయాలు చేసే వారు గొప్పగా ప్రసంగిస్తారని ఎలా అనుకోవాలి?

వివేకాను తామే చంపామని టీవీ ప్రత్యక్ష ప్రసారాల్లో తమతో తాముగా చెప్పుకున్న అసలు హంతకులను అప్రూవర్లుగా మార్చి, వారికి బెయిల్ వచ్చేలా చేసి, వారిని నిరంతరం కాపాడుతూ, ఇప్పుడు వారినే హీరోలుగా చూపిస్తున్నారు. ఒకప్పుడు వేళల్లో అప్పులు చేసిన వారు ఇప్పుడు లక్షాధికారులుగా మారిపోయారు ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు.

వివేకాగారి హత్య జరిగినప్పుడు అధికారంలో చంద్రబాబే ఉన్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించమన్నదీ, విచారణను పక్క రాష్ట్రానికి మార్చమన్నదీ మీరే. ఇప్పుడు అధికారంలో మీ చంద్రబాబే ఉన్నా, ఏడుపు మాత్రం మీదే. నిర్దోషులను బలిచేయాలన్న ఆరాటం ఎందుకు?. చంద్రబాబు కుట్రలో మిమ్మల్ని ఒక పావుల వాడుతున్నారు. దీనిలో బాగంగానే మీరు నిర్దోషులపై బురదజల్లుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడుకి మంచి చేయాలని మీ తాపత్రయం ప్రజలందరికీ స్పష్టంగా అర్థం అవుతుంది.చివరికి, మీ అన్నగారిని ఇబ్బందిపెట్టడమే మీ అసలు గమ్యం. బాబు కక్ష రాజకీయాల్లో మీరు మరో కోణంగా మారిన విధానం ప్రజలు గమనిస్తున్నారు అంటూ రోజా చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.