Pithapuram: పవన్ కేరాఫ్ పిఠాపురం… వర్మ సైడ్ అవ్వాల్సిందేనా… వర్మకు షాక్ ఇచ్చిన జనసేన!

Pithapuram: పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వర్సెస్ జనసేన అనే విధంగా చర్చ జరుగుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి వర్మ ఎన్నికలలో పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేశారు. అప్పట్లో వర్మకు చంద్రబాబు నాయుడు తదుపరి మంచి పదవులు ఇస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాత్రం పక్కకు తప్పుకుంటున్నారు దీంతో వర్మ రాజకీయ పరిస్థితి అగమ్య గోచరంగం మారిపోయింది.

ఇక వర్మ సహాయంతో గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగాను వివిధ శాఖలకు మంత్రిగాను కొనసాగుతున్నారు. ఇలా పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిచిన పవన్ కళ్యాణ్ ఇక పిఠాపురంలోనే పాగా వేయటానికి ప్లాన్ చేస్తున్నారు ఇందులో భాగంగానే పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ పవన్ కళ్యాణ్ ఇకపై ఇక్కడి నుంచే పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

ఇదే కనుక నిజమైతే వర్మ సైడ్ అయిపోవాల్సిందేనని స్పష్టం అవుతుంది. అయితే ఇప్పటికే పిఠాపురంలో జనసేన వర్సెస్ టిడిపి అనే విధంగా వివాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా ఇటీవల నాగబాబు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తమ వల్లే గెలిచారని ఎవరైనా భావిస్తే అది వారి కర్మ అంటూ పరోక్షంగా వర్మకు కౌంటర్ ఇచ్చారు. ఇక ఇప్పటివరకు నాగబాబు ఎలాంటి ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనలేదు కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయడంతో ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనబోతున్నారు.

ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన నాగబాబు నేడు రేపు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, ఇతర శాఖలకు మంత్రిగా ఉన్న నేపథ్యంలో పిఠాపురం బాధ్యతలు అన్నీ కూడా తన అన్నయ్య నాగబాబుకే ఇచ్చారని తెలుస్తోంది. ఇకపై పిఠాపురంలో నాగబాబు ప్రాతినిథ్యం వహించబోతున్నారు దీంతో వర్మకు పూర్తిగా ప్రాధాన్యత తగ్గిపోతుంది.

ఇలా తనకు ఏ పార్టీ బలం లేకపోయినా కార్యకర్తలే తన బలం అనే విధంగా ఇప్పటికే వర్మ పిఠాపురం మొత్తం పర్యటన చేస్తూ..సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు.సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరు, పంపిణీ లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తన మార్క్ చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు నాగబాబు ఎంట్రీతో వర్మకు కాస్త ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతాయని తెలుస్తోంది.