హిజ్రీ శకం 2వ సంవత్సరం. ఆ రకంగా ప్రవక్త (స) మొత్తం 9 రమజానులు ఉపవాసం ఉన్నారు.
ఉపవాసం ద్వారా ‘దైవభీతి- తఖ్వా’ అనే అత్యున్నత గుణం, అత్యద్భుత ఆభరణం, అత్యుత్తమ సామగ్రి మనిషికి చేకూరాలన్నదే మొఖ్యొద్దేశ్యం. అల్లాహ్ ఇలా ఉపదేశిస్తున్నాడు-”లఅల్లకుమ్ తత్తఖూన్” తద్వారా మీలో దైవభీతి పుడుతుందని చెబుతున్నారు.
ఇక తక్వా నిర్వచనాలు పలువురు పలు విధాలుగా చెప్పారు. హజ్రత్ అలీ (ర) గారు ఇలా అన్నారు ”మహోన్నతునికి భయ పడటం, అవతరించిన దానిపై (ఖుర్‌ఆన్‌పై) ఆమలు చేయడం, తక్కువ ఒనరులతో సంతృప్తి చెందటం, రాబోవు దినం కోసం సన్నాహాలు చేసుకోవడం” అని అన్నారు. ”ఎవరయితే ఉపవాసం ఉండి అబద్ధమాడటం, అబద్ధఖ ప్రకారం వ్యవహారం చేయడం మానుకోడు అతను ఆహార పానీయాలను విడనాడటం పట్ల అల్లాహ్‌కు ఎలాంటి ఆసక్తి లేదు”. (బుఖారీ)
ఉపవాసం ఏదయినా సంకల్పం తప్పనిసరి. తేడా ఏమిటంటే, ఫర్జ్ ఉపవాసానికి ఫజ్రె సాదిఖ్‌కి ముందే సంకల్పం చేసుకోవాలి. నపీల్ ఉపవాసానికి కాస్త ఆలస్యంగానయినా సరే సంకల్పం చేసుకునే అనుమతి ఉంటుంది.
ఉపవాసం ఔన్నత్యం ఎంతో ఘనమయినది. ప్రవక్త (స) ఇలా అన్నారు: ”నిశ్చయంగా స్వర్గానికి గల (ఎనిమిది) తలుపుల్లో ఓ తలుపు పేరు ‘రయ్యాన్’. రేపు ప్రళయ దినాన ఈ మార్గం గుండా కేవలం ఉపవాస దీకకులు మాత్రమే ప్రవేశిస్తారు. వారికి తప్ప ఇంకెవ్వరికి ఆ మార్గం గుండా ప్రవేశం ఉండదు….” (బుఖారీ, ముస్లిం) రమజాను ఉపవాసాలు విధి. ఇవి తప్ప మిగతా ఉపవాసాలు నఫిల్‌గా ఉంటాయి. పుణ్యం ప్రతి విధమయినటువిం ఉపవాసానికి లభిస్తుంది. అయితే ”రమజాను సాంతం ఉపవాసాలున్న వ్యక్తి గత పాపాలన్నీ మన్నించ బడతాయి” అన్నారు ప్రవక్త ముహమ్మద్ (స). (ముత్తఫఖున్ ఆలైహి)