కన్నతల్లిని ఇంట్లో పెట్టి తాళం వేసి…ఛీ ఛీ కసాయి కొడుకు(వీడియో)

కన్న తల్లిని ఇంట్లో పెట్టి తాళం వేసిన కసాయి కొడుకు…వత్తాసు పలికిన కోడలు. ఈ ఘటన జగ్గయ్యపేటలో చోటు చేసుకుంది. ఇల్లు ఖాళీ చేయాలని లేకపోతే బయటకు పంపనని తల్లి పద్మావతిని ఇంట్లో ఉంచి తాళం వేసి కుమారుడు మల్లిఖార్జున రావు, కోడలు ఆండాళ్. మల్లిఖార్జునరావు తల్లి ఉంటున్న ఇల్లు అతనిదే.

పద్మావతి అదే ఏరియాలో వేరే ఇంట్లో అద్దెకు ఉండేది. అతనికి చాలా ఇళ్ళు ఉండగా తల్లిని అద్దె ఇంట్లో ఉంచితే లోకులు ఏమైనా అనుకుంటారేమో అని ఒక ఇల్లు కట్టించి తల్లిని అందులో పెట్టాడు. మళ్ళీ ఏమైందో కానీ ఆ ఇంటిని అమ్మి అప్పులు తీర్చుకోవాలి అని తల్లిని ఇల్లు ఖాళీ చేయమని లేదంటే బయటకు పంపమని ఇంటికి తాళం వేశారు కొడుకు, కోడలు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె నుండి వివరాలు సేకరిస్తున్నారు. కింద వీడియోలు చూడవచ్చు.

[videopress TuBQnv22]

[videopress lgz57Hp0]

[videopress IzEsRGXp]