Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు అగ్నిప్రమాదంలో గాయాలు పాలైనట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలియడంతో జనసైనికులు మెగా అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగింది ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఎలా ఉంది అనే విషయానికి వస్తే …
పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈమెకు ఒక కుమారుడు కూడా జన్మించారు. ఈ చిన్నారికి మార్క్ శంకర్ అని పేరు కూడా పెట్టారు. అయితే తాజాగా స్కూల్లో మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైనట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య సింగపూర్లో పిల్లలతో కలిసి నివసిస్తున్నారు అయితే పాఠశాలలో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తుంది.
పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న ఈ చిన్నారి కాళ్లు చేతులు కాలి గాయాలు అయ్యాయని అలాగే ఊపిరితిత్తులోకి పొగ వెళ్లడంతో చిన్నారి కాస్త అస్వస్థతకు గురి అయినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే చిన్నారి మార్క్ శంకర్ ను హాస్పిటల్ కి తరలించారు. అయితే ఈ విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్ వెళ్లాలని అధికారులు ఆదేశించగా పవన్ కళ్యాణ్ మాత్రం వెళ్లటం లేదని తెలుస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట అనే కార్యక్రమంలో భాగంగా గిరిజన ప్రాంతాలలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. నేటి పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ కురిడి గ్రామానికి వస్తానని అక్కడ ప్రజలకు మాట ఇచ్చానని అక్కడికి వెళ్లి ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాతనే సింగపూర్ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ పర్యటన ముగించుకున్న పవన్ కళ్యాణ్ సింగపూర్ వెళ్లి తన కొడుకును పరామర్శించబోతున్నారని తెలుస్తోంది.