Vilan: వారసుడిని రంగంలోకి దింపుతున్న విలన్.. ఆ ఒక్క మూవీతో ఫేమస్.. ఎవరో తెలుసా?

Vilan: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది హీరో హీరోయిన్లు వారి పిల్లలను, వారసులను సినీ ఫీల్డ్ లోకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అలా చాలామంది సినిమా బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరో హీరోయిన్గా నటీనటులుగా రాణిస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త హీరో హీరోయిన్స్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మరో నటుడు కూడా తన కొడుకుని రంగంలోకి దింపడానికి సిద్ధం అయ్యారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు ఏంటి అన్న విషయానికి వస్తే.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన యానిమల్ సినిమాలో ఎలాంటి డైలాగ్స్ లేకుండా కేవలం తన క్యారెక్టర్ అభినయంతో అదరగొట్టాడు బాబి డియోల్.

వైల్డ్ క్యారెక్టర్ లో కనిపించి తనలో ఉన్న మరొక యాంగిల్ ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ సినిమాతో బాబీ డియోల్ కి భారీగా గుర్తింపు దక్కింది. అంతేకాకుండా ఈ సినిమాలోని అతని నటనకు గాను బెస్ట్ విలన్ గా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డును కూడా దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వ‌రుస క్రేజీ సినిమా ల‌లో న‌టిస్తూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయారు. ప్ర‌స్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్‌ ల‌లో బాబీ డియోల్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. హిందీలో ఆల్ఫా, తెలుగులో ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టిస్తున్న హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు,త‌మిళంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తున్న చివ‌రి మూవీ జ‌న నాయ‌గ‌న్‌ సినిమాలో న‌టిస్తున్నాడు.

కాగా ఈ సినిమాలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఇదిలా ఉంటే విల‌న్‌ గా త‌న స‌త్తా చాటుకుంటూ వ‌రుస క్రేజీ ప్రాజెక్ట్‌ ల‌తో బిజీగా ఉన్న బాబీ డియోల్ త్వ‌ర‌లో త‌న వార‌సుడిని రంగంలోకి దింపాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారట. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొద‌లు పెట్టాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా బాబీ డీయోల్ త‌న‌యుడు ఆర్య‌మ‌న్ ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వ‌డానికి సిద్ధం అవుతున్నాడట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జోరుగా జ‌రుగుతున్నాయి. త‌న వార‌సుడి అరంగేట్ర ఫిల్మ్‌ ని బాబీ డియోల్ హోమ్ బ్యాన‌ర్‌ లో నిర్మించ‌బోతున్నారట. దీనికి సంబంధించిన స్టోరీని ఫైన‌ల్ చేసే ప‌నిలో బాబి డియోల్ ఫుల్ బిజీగా మారిపోయారు. స్టోరీ ఫైన‌ల్ అయ్యాక డైరెక్ట‌ర్‌ తో పాటు ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల్ని ఫైన‌ల్ చేస్తార‌ట‌. వార‌సుడి ఎంట్రీకి సంబంధించిన మూవీ కాబ‌ట్టి డియోల్ ఫ్యామిలీ ఈ ప్రాజెక్ట్‌ ని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంద‌ని బాలీవుడ్ లో గట్టిగానే టాక్ నడుస్తోంది.