Rohini: తెలుగు ప్రేక్షకులకు లేడీ కమెడియన్ రోహిణి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట సీరియల్స్ లో నటించిన రోహిణి ఆ తర్వాత బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలలో పాల్గొని లేడీ కమెడియన్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రోహిణి ప్రస్తుతం జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, కామెడీ స్టార్స్ వంటి షోలతో పాటు పండుగ ఈవెంట్లలో కూడా పాల్గొంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది.
ప్రస్తుతం వరుసగా షోలు చేస్తూ బిజీబిజీగా ఉంది రోహిణి. అలా ప్రస్తుతం లేడీ కమెడియన్ గా నటిగా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. ఇది ఇలా ఉంటే ఇటీవల రోహిణి తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. రోహిణి పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఆమెకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అయితే పుట్టినరోజు తర్వాత తనకు వచ్చిన కానుకల గురించి ఆమె తెలిపింది.
తన ఫ్రెండ్స్ ఉంగరం, నెక్లెస్, హ్యాండ్ బ్యాంగ్, చీర వంటి కానుకలను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. తన తల్లి ఊహించని బహుమతి ఇచ్చింది అంటూ ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. రోహిణికి తల్లి నాలుగు బంగారు గాజులను గిఫ్ట్ గా ఇచ్చిందట. ఆమె ఇచ్చిన గాజులను చూసి మురిసిపోయిన నటి తల్లిపై ముద్దుల వర్షం కురిపించింది. మా అమ్మ నాకోసం బంగారు గాజులు కొనిందోచ్ అంటూ యూట్యూబ్ లో వీడియో షేర్ చేసింది. ఇకమీద ఇవే వేసుకుని తిరుగుతాను అని రోహిణి తెలిపింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rohini: కమెడియన్ రోహిణికి బంగారు కానుక ఇచ్చిన తల్లి.. ఆ వస్తువు ఏంటో తెలుసా?
