Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో రష్మిక నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలుస్తున్నాయి. దాంతో సినిమా నిర్మాతలకు డైరెక్టర్లకు రష్మిక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.
తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది. రీసెంట్ గా పుష్ప2, ఛావా, కుబేర సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. అలాగే ఈ చిన్నది ఇప్పుడు పెద్ద పెద్ద హీరోల సినిమాల్లోనూ నటిస్తుంది. ఇది ఇలా ఉంటే స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యింది. వీకెండ్ సెలవుల కోసం నేను ఏడుస్తాను అని తెలిపింది రష్మిక. ఈ ముద్దుగుమ్మ తన ఫ్యామిలీని బాగా మిస్ అవుతుందట. ముఖ్యంగా తన చెల్లిని, తనతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నా అంటూ ఎమోషనల్ అయ్యింది రష్మిక.
కాగా ఈ సందర్బంగా రష్మిక మాట్లాడుతూ.. నా చెల్లి చాలా చిన్నది. నా కన్నా 16 ఏళ్లు చిన్నది. ఇప్పుడు తన వయసు 13. నేను తనను చాలా మిస్ అవుతున్నాను. నా కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను తనను సరిగ్గా చూసుకోలేదు. నేను ఇంటికి వెళ్లి ఏడాదిన్నర అవుతుంది. మా అమ్మను, చెల్లిని చాలా మిస్ అవుతున్నాను. అలాగే నా ఫ్రెండ్స్ ను కూడా బాగా మిస్ అవుతున్నాను. ఒకప్పుడు అందరం కలిసి ట్రిప్స్ కు వెళ్లేవాళ్లం. కానీ ఇప్పుడు కుదరడం లేదు. ఏడాదిన్నరగా నేను నా స్నేహితులను చూడలేకపోయాను. మా అమ్మ ఎప్పుడూ ఒక మాట చెప్పేది వృత్తిలో రాణించాలి అంటే వ్యక్తిగత జీవితం త్యాగం చేయాలి అని. మా అమ్మకు నేను రెండింతలు కష్టపడి పని చేస్తా అని చెప్పేదాన్ని. నేను ఎప్పుడూ మీకు కొత్తదనాన్ని.. భిన్నమైనదాన్ని.. ఆసక్తికరమైన దాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా సినిమాలు కూడా అలా ఉండేలా సెలక్ట్ చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. ఈ సందర్బంగా రష్మిక మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
