అప్పు చేసి పప్పుకూడు రాష్ట్రానికి మంచిదా జగన్.. ప్రజలు కోరుకునేది ఇదే?

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం కొంతమేర అభివృద్ధిపై ప్రధానంగా దృష్టి పెట్టారనే సంగతి తెలిసిందే. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటయ్యే దిశగా జగన్ అడుగులు వేస్తుండటం శుభ పరిణామమని చెప్పవచ్చు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురంలో సెజ్ ప్రారంభం కానుంది. అయితే వైసీపీపై ప్రజల్లో మరింత మంచి అభిప్రాయం కలగాలంటే మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రావాల్సిన అవసరం అయితే ఉంది.

అయితే ఇదే సమయంలో అప్పు చేసి పప్పుకూడు రాష్ట్రానికి మంచిదా జగన్ అని ప్రజల నుంచి ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుల భారం అంతకంతకూ పెరుగుతోంది. ఉన్న అప్పులను తీర్చకుండానే ప్రభుత్వం కొత్త అప్పులపై దృష్టి పెట్టడంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం చేస్తున్న అప్పుల వల్ల ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా రాబోయే రోజుల్లో ఏపీకి ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు.

జగన్ పాలనలో పరిశ్రమల ఏర్పాటు పెరగడంతో పాటు ఎక్కువ పరిశ్రమలు తీసుకొస్తే మాత్రమే రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు పడే ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం అప్పులు చేయడం కంటే అభివృద్ది కోసం అప్పులు చేస్తే బాగుంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ప్రభుత్వంగా మిగిలిపోవడం వల్ల వైసీపీకి నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పవచ్చు.

జగన్ నుంచి జనం సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారనే సంగతి తెలిసిందే. జగన్ 2024లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకొనిరావాలంటే పార్టీ అభివృద్ధి దిశగా అడుగులు వేయక తప్పదు. జగన్ జనంలోకి కూడా రావాల్సిన అవసరం ఉందని జనానికి దూరంగా ఉండటం వల్ల పార్టీకి నష్టమే తప్ప ఏ మాత్రం లాభం ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఈ విషయంలో మారతారో లేదో చూడాల్సి ఉంది.