Nara Lokesh: శవం దగ్గర నుంచి పుట్టిన పార్టీ వైసీపీ…. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు!

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ వైఎస్ఆర్ సీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్యను మంత్రి లోకేశ్‌ ఖండించారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైసిపి రాక్షస మూకల దాడిలో మృతిచెందిన టీడీపీ కార్యకర్త రామకృష్ణకు కన్నీటి నివాళులు అర్పిస్తున్నాను.

ఈ దాడిలో భాగంగా గాయపడిన రామకృష్ణ కుమారుడు సురేష్ కు మెరుగైన వైద్యం అందించడం కోసం అన్ని ఏర్పాట్లు చేసామని తెలిపారు. ఒక శవం దగ్గర పుట్టి, మరో మృతదేహంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ, జగన్మోహన్‌ రెడ్డిని జనం ఛీకొట్టారు. అయినా హత్యా రాజకీయాలు మానడం లేదని వైసిపి పార్టీపై ఫైర్ అయ్యారు. ఇందుకు కారణమైనటువంటి నిందితులకు తప్పకుండా శిక్ష విధిస్తామని లోకేష్ వెల్లడించారు.

వైసీపీ రక్త చరిత్రకు టీడీపీ సైనికుడిని కోల్పోవడం చాలా బాధాకరం.వారి కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని లోకేష్ బాధిత కుటుంబానికి భరోసా కల్పించారు. ఇకపోతే నారా లోకేష్ వైసీపీ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త సంచలనగా మారాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు మరణంతో ఆయన శవం నుంచే వైసిపి పార్టీ పుట్టిందని పరోక్షంగా తెలిపారు. అదే విధంగా వైఎస్ వివేకానంద రెడ్డిని దారుణంగా హత్య చేసి ఆయన శవం వద్ద నుంచి ఈయన ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు అంటూ లోకేష్ వైసీపీ పై అలాగే జగన్మోహన్ రెడ్డి పై విమర్శలు కురిపించారు.