కాకినాడలో దారుణం: జర్నలిస్టుపై బీజేపీ నాయకుల దాడి

జర్నలిస్టులపై రోజురోజుకి దాడులు పెరిగిపోతున్నాయి. ఈ దాడుల వెనుక రాజకీయనాయకులు ఉండటం దారుణం. వారే దగ్గరుండి ఈ దాడులకు ఉసిగొలపడం గమనార్హం. కాకినాడలో జరిగిన సంఘటన జర్నలిస్టుల ఆగ్రహానికి గురయ్యింది. బీజేపీ నాయకులు జర్నలిస్టుపై దాడి చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్సులు అల్లుమల్లు ఏలీయా, సలీమ్. మీడియాపై దాడి చేయడం అమానుషం అని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి సమక్షంలోనే మీడియాపై దాడి జరగటం ఆ పార్టీ నిరంకుశ ధోరణికి నిదర్శనంగా పేర్కొన్నారు. బాధిత పాత్రికేయ సోదరుడికి ఏపీడబ్ల్యూజేఎఫ్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మీడియాపై దాడిని ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నవీన్ రాజ్, జిల్లా ప్రచార కార్యదర్శి కర్రి ధర్మరాజు ఖండించారు. జర్నలిస్టులపై దాడి చేసిన బీజేపీ నాయకులను వెంటనే అరెస్టు చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు కరప మండల జర్నలిస్టుల ఆధ్వర్యంలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జర్నలిస్టుపై దాడి చేస్తున్న దృశ్యాలు కింద వీడియోలో ఉన్నాయి చూడండి.