AP: దోచుకో.. దాచుకో… ఆ దోపిడీ దారుడు జగన్ సోదరుడే…. మరో సంచలన ట్వీట్ చేసిన పృథ్వీరాజ్!

AP: సినీ నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు అయితే ఈయన చేసిన కొన్ని చర్యలు కారణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో తిరిగి జనసేన పార్టీలో చేరారు. ఇలా జనసేన పార్టీలో ఉంటే వైసిపి పార్టీ వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తూ వార్తలలో నిలుస్తున్నారు. అయితే ఇటీవల ఈయన 11 గొర్రెలు అంటూ మాట్లాడటంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

ఇలా సినీ వేదికలపై మాట్లాడుతున్న నేపథ్యంలో సినిమాకు ఇబ్బంది అవుతున్న తరుణంలో ఈయన ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. ఇలా ట్విట్టర్ వేదికగా నిత్యం ఎన్నో సంచలనమైన పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి ఈయన దోచుకో దాచుకో అంటూ పోస్ట్ చేశారు.

దోచుకోవడంలో వైసిపికి ఎవరు సాటిరారు అంటూ పృథ్వీరాజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది..కాకినాడ సి పోర్టు వాటాల కేసులు ప్రధానంగా ఉన్నది వైవి విక్రాంత్ రెడ్డి అని విజయసాయిరెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పృథ్వి జగన్మోహన్ రెడ్డి సోదరుడు ఈ దందాకు పాల్పడ్డాడంటూ ఆరోపించారు. జగన్ సోదరుడు వై.వి. విక్రాంత్ రెడ్డి అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి. దీంతో జగన్మోహన్ రెడ్డికి సుబ్బారెడ్డి బాబాయ్ అవుతారు. సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడు అవుతారు. ఈ లెక్కనే జగన్మోహన్ రెడ్డికి లింక్ చేశారు. ఇలా గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీలో భారీగా దోపిడీలు జరిగాయి అంటూ ఈయన చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనంగా మారింది.