Pawan Kalyan: మెగా అభిమానుల మృతి…. పరిహారం ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్!

Pawan Kalyan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఇటీవల రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా జరిగింది అయితే ఈ వేడుకలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు ముందస్తు చర్యలను చేపట్టారు. అయితే ఈ కార్యక్రమం పూర్తి అయ్యి ఇంటికి వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు.

ఇలా మెగా అభిమానులు ఇద్దరు మరణించడంతో ఈ విషయం కాస్త మరోసారి సంచలనంగా మారింది. అల్లు అర్జున్ అభిమానులు మరణిస్తే ఆయనని అరెస్టు చేసినప్పుడు మెగా అభిమానులు మరణిస్తే పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ని ఎందుకు అరెస్టు చేయకూడదంటూ కొందరు డిమాండ్లు చేస్తున్నారు. ఇలా మెగా అభిమానులు మరణించారని విషయం తెలియగానే వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఘటనపై స్పందిస్తూ మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు.

ఈ ఘటన గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు జనసేన పార్టీ నుంచి ఈయన ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రకటించారు. అదేవిధంగా ఈ వేడుకలో తాను అభిమానులకు ఒకటికి రెండుసార్లు ఇంటికి క్షేమంగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పినప్పటికీ ఈ ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు.

ఈ ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి రోడ్డును గత ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని అందుకే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అంటూ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పూర్తిగా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగిన ఘటనలో ఆయనని అరెస్టు చేశారు ఆయన 25 లక్షల ఆర్థిక సహాయం చేసిన జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇక మీ అభిమానులు మరణిస్తే 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు అంటూ కొందరు ప్రశ్నించడమే కాకుండా రోడ్డు బాగా లేకపోవడం వల్ల ప్రమాదం జరిగిందని చెప్పడం భావ్యం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలల అవుతుంది. మరి రోడ్ల విషయంలో మీరేం చేస్తున్నారు? మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.