చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో ఒకటే ప్రశ్న… టిఆర్ ఎస్ లో ఉన్న ప్రముఖ నాయకులంతా క్రౌడ్ పుల్లర్సే. ముఖ్యమంత్రి కెసియార్, ఐటి మంత్రి కెటిఆర్, నీటి పారుదల మంత్రి హరీష్ రావు, నిజాం బాద్ ఎంపి కవిత… ఇలా అంతా జనాకర్షణ ఉన్నోళ్లే. మరి కాంగ్రెస్ లో ఎవరున్నారనే ప్రశ్న వుండింది. అయితే, కాంగ్రెస్ లో కూడా పోటీ గా నాయకులు తయారవుతున్నారు. కాంగ్రెస్ వాళ్ల సభలకి విపరీతంగా జనం వస్తున్నారు. ఈ రోజు కొత్త కోటలో జరిగిన కాంగ్రెస్ సభకి వచ్చిన జనం చూస్తే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను అంత ఈజీగా కొట్టి పడేయలేమని పిస్తుంది.ఒకవైపు పార్టీలో చేరే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతూ ఉంది. మరొకవైపు కాంగ్రెస్ సభలకు పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు. మొత్తానికి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న గురిని కొన్ని వర్గాల్లో కల్పించడంలో తెలంగాణ కాంగ్రెస్ విజయవంతమయింది. దీనికి కొత్తకోట మీటింగే సాక్ష్యం.
ఈ రోజు కొత్తకోట సభలో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి ప్రసంగించారు.
ఈ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి బూతు భాషను తీవ్రంగా దుయ్య బట్టారు. నాలుగేళ్లలో చేసిందేమిటో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడానికేమీ లేక కనిపించిన వారినల్లా నోటికొచ్చినట్లు తిడుతున్నారని విమర్శించారు.
’ప్రజలకు చేసింది ఏమీలేక.. సమాధానం చెప్పుకోలేక.. ముఖ్యమంత్రి బూతుపురణం చదువుతున్నారు,’ విక్రమార్క విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తుందని విక్రమార్క చెప్పారు. కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ గవర్నమెంట్ ను ఏర్పాటు చేస్తుందని హామీ ఇచ్చారు. నాడు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చందని ఇందిరమ్మ ఇండ్లు, ఫీజ్ రీ ఎంబెర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, వంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని చెబుతూ 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని .. వచ్చాక.. అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని విక్రమార్క చెప్పారు.
ఇది కూడా చదవండి