పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన దుర్ఘటన తెలంగాణ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తుంది. దేశవ్యాప్తంగా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయి. కొందరు అధికార పార్టీని సమర్థిస్తుంటే మరి కొందరు టాలీవుడ్ ని టార్గెట్ చేశారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఈ విషయంపై సీనియర్ సినీ నటి, కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి స్పందించారు. సినిమా విడుదల సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటన తెలంగాణలో ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య విభజన రేఖలు తెచ్చే వరకు వెళుతున్నట్లుగా కనిపిస్తుంది.
సినిమా పరిశ్రమను నాశనం చేసేందుకే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారంటూ బిజెపి కేంద్రమంత్రులు ఆరోపణలు చేయటాన్ని ఖండించారు విజయశాంతి. గత రెండు రోజుల పరిణామాలు ప్రెస్ మీట్ లు తదనంతర భావోద్వేగాలు కనిపిస్తున్నాయి ప్రాంతాలుగా విడిపోయి ప్రజలుగా కలిసుందాం అనే నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి.
అలా కాకుండా మళ్లీ ప్రజల మనోభావాలు మధ్య విభజనలు వచ్చేవరకు నడవాలని ఈ సందర్భంగా కొన్ని రాజకీయ పార్టీల ప్రయోగంగా కనిపిస్తుందని విజయశాంతి అన్నారు. ఏది ఏమైనా ఒక సంఘటనను బిజెపి తమకు అనుకూలంగా చేసుకునే ప్రక్రియ గా ఈ అంశాలు తెలంగాణ ఏపీ రాష్ట్రాల్లోని బిజెపి నేతల ప్రకటనలను బట్టి అర్థమవుతుంది. సినిమా వారికి అన్ని ప్రాంతాల ప్రజల ప్రజల ఆదరణ కావలసి ఉంటుంది.
సినిమా పరిశ్రమకు ఎంత అవసరం అన్న విశ్లేషణ కూడా పరిశీలన చేయాలి వెంటనే ఈ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం జరగాలి అంటూ వీటిలో పేర్కొంది విజయశాంతి. అంతేకాకుండా తప్పు ఎవరి వైపు ఉందో తెలుసుకోకుండా కొందరు కామెంట్లు చేయడం పట్ల కూడా ఆమె ఫైర్ అయినట్లు సమాచారం. ఇప్పుడు విజయశాంతి చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దీనిపై భాజాపా మంత్రివర్గం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.