ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అధికార బీఆరెస్స్ అభ్యర్థులను, ప్రకటించేసి ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిపోగా, మరోపక్క కాంగ్రెస్ కూడా 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. రాహుల్ ని పిలిపించి ప్రచారాల్లో బిజీ అయిపోయింది. ఈ సమయంలో బీజేపీ కూడా తన తొలి జాబితాను తాజాగా విడుదల చేసింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది. తొలివిడతగా 52 మందితో జాబితాను వెల్లడించింది. ఇందులో భాగంగా… కరీంనగర్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కోరుట్ల నుంచి ధర్మపురి అర్వింద్ లు ఈసారి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ పై గజ్వేల్ నుంచి పోటీచేయనున్న ఈటెల రాజేందర్… హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ బరిలో నిలవనున్నారు.
ఇక ఈ 52 మంది తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం కల్పించారు. తొలుత కామారెడ్డి నుంచి విజయశాంతిని సీఎం కేసీఆర్ పైన పోటీకి నిలబెడతారని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ జాబితాలో మాత్రం అక్కడ నుంచి వెంకట రమణా రెడ్డి పేరు ఫైనల్ చేసారు. కాగా… మరో రెండు రోజుల్లో మిగిలిన నియోజకవర్గాల అభ్యర్దులను ప్రకటించనున్నారని తెలుస్తుంది.
అసెంబ్లీకీ, పార్లమెంటుకూ ఒకేసారి ఎన్నికలు జరగకపోవడంతో… ముందు అసెంబ్లీని గట్టెక్కాలని భావించారో.. ఏమో కానీ… బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. బండి సంజయ్ (కరీంనగర్), సోయం బాపూరావు (బోథ్), ఎంపీ అర్వింద్ (కోరుట్ల) లు అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు.
నియోజకవర్గాలు – అభ్యర్థుల జాబితా:
కరీంనగర్ – బండి సంజయ్
హుజురాబాద్ – ఈటల రాజేందర్
గజ్వేల్- ఈటల రాజేందర్
కోరుట్ల- ధర్మపురి అర్వింద్
దుబ్బాక – రఘునందన్ రావు
గోషామహల్- రాజాసింగ్
బోథ్ (ఎస్టీ) – సోయం బాపూరావు
కుత్బుల్లాపూర్- కూన శ్రీశైలం గౌడ్
ఖైరతాబాద్- చింతల రామచంద్రారెడ్డి
నిర్మల్- ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ముథోల్ – రామారావు పటేల్
ఆదిలాబాద్- పాయల్ శంకర్
జుక్కల్ (ఎస్సీ) – టి.అరుణ తార
కామారెడ్డి -వెంకట రమణా రెడ్డి
ఆర్మూరు- పైడి రాకేశ్ రెడ్డి
సిర్పూర్ – పాల్వాయి హరీశ్ బాబు
బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి
ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాఠోడ్
స్టేషన్ ఘన్‌పూర్(ఎస్సీ)- డాక్టర్ గుండే విజయరామారావు
చొప్పదండి (ఎస్సీ) – బొడిగె శోభ
నిజామాబాద్ అర్బన్- సూర్యనారాయణ గుప్తా
బాల్కొండ – ఆలేటి అన్నపూర్ణమ్మ
జగిత్యాల – బోగ శ్రావణి
ధర్మపురి -ఎస్. కుమార్
రామగుండం – కందుల సంధ్యారాణి
సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి
మానకొండూరు( ఎస్సీ)- ఆరెపల్లి మోహన్
వరంగల్ ఈస్ట్- ఎర్రబెల్లి ప్రదీప్‌రావు
వరంగల్ వెస్ట్- రావు పద్మ
నాగార్జునసాగర్- కంకణాల నివేదితారెడ్డి
నర్సాపూర్ – మురళీ యాదవ్
పటాన్‌చెరు – నందీశ్వర్ గౌడ్
ఇబ్రహీంపట్నం- నోముల దయానంద్‌గౌడ్
మహేశ్వరం- అందెల శ్రీరాములు యాదవ్
కార్వాన్- అమర్ సింగ్
చార్మినార్-మేఘారాణి
చాంద్రాయణగుట్ట- సత్యనారాయణ ముదిరాజ్
యాకుత్ పురా-వీరేందర్ యాదవ్
బహుదూర్‌పురా- నరేశ్‌కుమార్
కల్వకుర్తి- తాల్లోజు ఆచారి
కొల్లాపూర్- ఎ.సుధాకర్ రావు
సూర్యాపేట- సంకినేని వెంకటేశ్వరరావు
భువనగిరి- గూడూరు నారాయణరెడ్డి
తుంగతుర్తి- కడియం రామచంద్రయ్య
జనగామ- ఆరుట్ల దశమంత్ రెడ్డి
పాలకుర్తి- లేగ రామ్మోహన్ రెడ్డి
డోర్నకల్ (ఎస్టీ)- భుక్యా సంగీత
వర్ధన్నపేట (ఎస్సీ)- కొండేటి శ్రీధర్
మహబూబాబాద్ (ఎస్టీ)- జతోత్ హుస్సేన్ నాయక్
భూపాలపల్లి- చందుపట్ల కీర్తిరెడ్డి
భద్రాచలం (ఎస్టీ)- కుంజా ధర్మారావు
ఇల్లెందు (ఎస్టీ)- రవీందర్ నాయక్