సీనియర్ నటి పొలిటికల్ సినిమా.?

ఓ సీనియర్ నటి నిర్మాతగా పొలిటికల్ నేపథ్యం వున్న సినిమా తెరకెక్కబోతోందనేది తాజా గాసిప్. ఎవరా సీనియర్ నటి.? ఏంటా నిర్మాణ కథ.? అంటే, రాజకీయాల్లో సీనియర్ నటీమణులు చాలా మందే వున్నారు.

రోజా, జయసుధ, జయప్రద జీవిత, విజయ శాంతి ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ పార్టీల్లో తమదైన స్టైల్‌లో రాజకీయ వ్యవహారాలు చక్కబెడుతున్నారు ఈ నటీమణులంతా. వీరిలో ఎవరికి ఈ ఆలోచన వచ్చిందో కానీ, తెర వెనకాల కథా చర్చలు జరుగుతున్నాయనీ ఓ గాసిప్ వినిపిస్తోంది. తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై ఈ సినిమా వుండబోతోందట.

తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై వ్యంగ్రాస్ర్తాలు విసిరేలా చాలా పవర్ ఫుల్ స్టోరీతో ఈ సినిమా రూపొందబోతోందనీ తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో ఆ సీనియర్ నటి నటిస్తుందా.? అనేది సస్పెన్స్.

ఇకపోతే, వ్యంగ్యాస్ర్తాల తరహాలో వుండబోతోందంటే, ఆ లిస్టులో రోజాకి ఛాన్స్ లేదనే చెప్పొచ్చేమో. ప్రస్తుత రాజకీయాల్లో అత్యంత యాక్టివ్‌గా వున్న రాజకీయ నాయకురాలు రోజానే. అలాగే, ఆమెపై వచ్చే వ్యంగ్యాస్త్రాలూ, ఆమె ప్రతిపక్షాలపై విసిరే వ్యంగ్యాంస్ర్రాలు ఏ రేంజ్‌లో వుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

జరుగుతున్న ప్రచారం నిజమై, నిజంగానే ఈ సినిమా తెరకెక్కితే ఒకింత ఆసక్తికరమైన అంశమే. అయితే, ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, ఇతర టెక్నీషియన్లు ఎవరు.? అనే దానిపై ఇంకాస్త క్లారిటీ రావల్సి వుంది.