పవన్ కు 2024 ఎన్నికల్లో కూడా నిరాశేనా.. ఎన్నికల ఫలితాలతో షాక్ తప్పదా?

Vishaka Gharjana

ఏపీలో ఎనిమిదేళ్ల క్రితం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు. జనసేన పార్టీ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించడం ఖాయమని జనసేన మరో ప్రజారాజ్యం కాదని చాలామంది భావించారు. కానీ పార్టీ అధినేత అయిన పవన్ కే రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఆసక్తి లేదు. తాజాగా ఇండియా టుడే సర్వే ఫలితాలు వెలువడగా ఆ సర్వేలో జనసేనకు వ్యతిరేకంగా ఫలితాలు ఉండటం గమనార్హం.

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి 18 ఎంపీ సీట్లు, టీడీపీకి 7 ఎంపీ సీట్లు వస్తాయని సర్వే ఫలితాలలో తేలింది. సర్వే ఫలితాలు పవన్ కళ్యాణ్ అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేస్తున్నాయి. 2024 ఎన్నికల్లో కూడా జనసేన సత్తా చాటే అవకాశం అయితే లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెడితే మాత్రమే ఎన్నికల ఫలితాలు మారే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఒకవైపు పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు దూరంగా ఉండటంతో ఆయనతో సినిమాలను తెరకెక్కించే నిర్మాతలు తెగ టెన్షన్ పడుతున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు తగినంత సమయం కేటాయించకపోవడంతో ఆయనతో సినిమాలను తెరకెక్కించే జనసేన నేతలు తెగ టెన్షన్ పడుతుండటం గమనార్హం. పవన్ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో కొన్ని స్థానాలలో అయినా జనసేన తరపున అభ్యర్థులను పోటీ చేయించాలని భావిస్తున్నారు.

అయితే జనసేన ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అధికారంలోకి రావడం జరగదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పవన్ సినిమాలకు దూరమై పూర్తిస్థాయిలో రాజకీయాలకు సమయం కేటాయిస్తే మాత్రమే ఎన్నికల ఫలితాలు మారే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ విషయంలో రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.