‘ఎఫ్‌2’డైరక్టర్ అనీల్ రావిపూడిని అరెస్ట్‌ చేస్తున్నాం

సంక్రాంతి బరిలో దిగి.. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా, సూపర్‌హిట్‌గా నిలిచింది ఎఫ్‌2. ఇప్పటికీ అన్ని ఏరియాల్లో విజయవంతంగా రన్‌ అవుతోంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనిల్‌ రావిపూడి ఈ చిత్రాన్ని మలిచారు. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందించారు.

సంక్రాంతి సీజన్‌ అయిపోయినా.. ఎఫ్‌2 సందడి మాత్రం ఇంకా తగ్గడంలేదు. పోటీ సినిమా థియేటర్లలోకి రాకపోవడంతో ఈ చిత్రంకు ఎదురేలేకుండా పోయింది. ఇప్పటికీ ఈ చిత్రం వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే ఈ సినిమా రెండు వందల కోట్ల క్లబ్‌లోకి చేరేట్టు కనిపిస్తోంది.

దాంతో ఈ సినిమా సక్సెస్‌ను చిత్రయూనిట్‌ ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తోంది. విక్టరీ వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌, దిల్‌ రాజు, హీరోయిన్లు ఈ సినిమాతో మంచి సక్సెస్‌ను కొట్టారు. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ దర్శకుడు అనిల్‌ రావిపూడిపై చేసిన కామెంట్‌ తెగ వైరల్‌ అవుతోంది. చిత్రీకరణ సమయంలో దిగిన ఫోటోను షేర్‌చేస్తూ.. ‘థియేటర్లలో పగలబడి నవ్వించినందుకు అరెస్ట్‌ చేస్తున్నా’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవుతోంది.

‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘గతంలో 50 రోజులు, 100 రోజుల వేడుకలుండేవి.ఇప్పుడు అవన్నీ పోయి 50 కోట్లు, వందకోట్ల గ్రాస్, షేర్స్‌ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అందరికీ మా ‘ఎఫ్‌2’ చిత్రం వంద కోట్ల గ్రాస్‌ షీల్డ్స్‌ని పంపిస్తున్నాం. ఇది మా సినిమాతో స్టార్ట్‌ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు.

‘‘వందకోట్ల సినిమా చెయ్యాలన్నది ప్రతి డైరెక్టర్‌ కల. అది ‘ఎఫ్‌2’ తో నాకు దక్కినందుకు హ్యాపీ. ప్రేక్షకులు మరింత ఎంజాయ్‌ చేయడానికి 5 కొత్త సీన్స్‌ని యాడ్‌ చేస్తున్నాం. ఈ చిత్ర విజయంలో చాలామంది కష్టం ఉంది’’ అన్నారు అనిల్‌ రావిపూడి.

‘‘దిల్‌’ రాజుగారు రిలీజ్‌ చేసిన ‘హ్యాపీడేస్‌’ సినిమా నాకు టర్నింగ్‌ పాయింట్‌. ఇప్పుడు ‘ఎఫ్‌ 2’ బిగ్గెస్ట్‌ హిట్‌ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లాక్‌ బస్టర్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు తమన్నా.