‎Cinema: ఇదేందయ్యా ఇది.. సినిమా చూసి ఏడుస్తూ, స్పృహ తప్పి పడిపోతున్న జనాలు?

‎Cinema: మామూలుగా సినిమాను థియేటర్లలో చూసినప్పుడు కొన్నిసార్లు బాధపడటం, భయపడడం కొన్నిసార్లు ఏడవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే సినిమాను చూసిన ప్రేక్షకులు కేవలం ఏడవడం మాత్రమే కాదండోయ్ స్పృహ తప్పి పడిపోతున్నారట. ఇంతకీ సినిమా ఏది? ఎందుకు ప్రేక్షకులు ఏడుస్తున్నారు అన్న విషయానికి వస్తే.. ఇటీవల జూలై 18న విడుదల అయింది సైయారా మూవీ.కాగా ఇప్పటివరకు ఈ మూవీ రూ.120 కోట్లు రాబట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా పేరు మారుమోగుతుంది.

‎ఆ మూవీ చూస్తూ థియేటర్లలో జనాలు చేస్తున్న నాటకాలు, హడావిడి మాములుగా లేదు. గుండెలు బాదుకుంటూ తెగ ఏడుస్తున్నారు. అంతే కాకుండా స్పృహ తప్పి పడిపోతున్నారు. ఇక మరికొందరు మాత్రం ఏకంగా సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ సినిమాకు వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చేస్తుంది. సినిమా నచ్చి కొందరు థియటేర్లకు వెళ్తుంటే అసలు ఈ మూవీ కథేందీ అంటూ మరికొందరు వెళ్తున్నారు. మొత్తానికి స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది ఈ మూవీ.

https://www.instagram.com/reel/DMXX_EPM8tH/?utm_source=ig_web_copy_link

‎పెద్దగా ప్రచారం చేయకపోయినా ఇప్పటివరకు రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జూలై 18న విడుదలై ప్రస్తుతం థియేటర్లలో భారీ రస్పాన్స్ తో దూసుకుపోతుంది. ఇంతకీ ఈ మూవీ కథ ఏంటీ? అన్న విషయానికి వస్తే.. సంగీతం అంటే ఇష్టం ఉన్న ఒక యువకుడు ఎలాగైనా మ్యూజిక్ కంపోజర్ కావాలనుకుంటాడు. అతడిని ఒకసారి చూసిన జర్నలిస్టు, లిరిసిస్ట్ అమ్మాయి ఇష్టపడుతుంది. వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది. అత్త ఇద్దరూ సంతోషంగా ఉంటున్న సమయంలోనే వాణీ బాత్రా (హీరోయిన్)ను ప్రేమ పేరుతో గతంలో మోసం చేసిన వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడు. అప్పటికే మానసిక సమస్యలతో ఇబ్బందిపడుతున్న వాణి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఆ వ్యక్తి రాకతో వీరిద్దరి మధ్య ఎలాంటి పరిస్థితి తలెత్తుతాయి? చివరకు వాణీ బాత్రా ఎవరిని వివాహం చేసుకుంటుంది అనేది సినిమా. ఇందులో అహాన్ పాండే, అనీత్ పడ్డా ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాలో యాక్టర్స్ నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ హృదయాలను హత్తుకుంటాయి. ఇదొక ఫీల్ గుడ్ స్టోరీ అని చెప్పాలి.