అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకోవడంతో ఆ కార్యక్రమ రేటింగ్ ఎలా ఉందో తెలుసా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం గత పది సంవత్సరాల నుంచి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని దూసుకుపోతుంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఎంట్రీ ఇచ్చి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని అనంతరం ఈ కార్యక్రమం నుంచి దూరమవుతున్నారు. ఇలా ఈ కార్యక్రమానికి దూరమైన వారిలో అనసూయ ఒకరు.

అనసూయకు వరుస సినిమాలో వెబ్ సిరీస్లలో నటించే అవకాశం రావడం వల్ల ఈమె పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైపోయారు. ఇలా అనసూయ జబర్దస్త్ కార్యక్రమం నుంచి వెళ్లిపోవడంతో ఈ కార్యక్రమం రేటింగ్స్ పూర్తిగా పడిపోతాయని అందరూ భావించారు. ఇక అనసూయ ఈ కార్యక్రమం నుంచి వెళ్ళిపోవడంతో అనసూయ స్థానంలోకి యాంకర్ గా రష్మిని తీసుకొచ్చారు.అనసూయ స్థానంలో రష్మీ కూడా ఎంతో అద్భుతమైన యాంకరింగ్ తో ఈ కార్యక్రమాన్ని అదే స్థాయిలో ముందుకు నడిపిస్తున్నారు.

జబర్దస్త్ కార్యక్రమం నుంచి అనసూయ తప్పుకోవడంతో ఈ కార్యక్రమా రేటింగ్స్ విషయంలో కొంత ఆందోళన చెందారు. అయితే అనసూయ బదులు రష్మీ రావడం వల్ల ఈ కార్యక్రమ రేటింగ్ విషయంలో ఏ విధమైనటువంటి మార్పు లేదని, ఎప్పటిలాగే ఈ కార్యక్రమం మంచి రేటు సొంతం చేసుకుంటుందని తెలుస్తోంది.ఈ కార్యక్రమం నుంచి అనసూయ వెళ్ళిపోయినప్పటికీ కార్యక్రమ రేటింగ్స్ లో ఏ విధమైనటువంటి మార్పు రాలేదని సమాచారం