బాలకృష్ణ మరోసారి నవ్వులు పాలయ్యారు (వీడియో)

ప్రస్తుతం సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ షూటింగ్ కు శెలవు పెట్టి మహాకూటమి తరఫున ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తన డైలాగుల తడబాటుతో మరోసారి నవ్వుల పాలయ్యారు. బాలకృష్ణ మరోసారి నవ్వుల పాలయ్యారు.

హైదరాబాద్ నగరంలోని ఓల్డ్‌ బోయిన్‌పల్లిలో నిర్వహించిన రోడ్‌షోలో బాలయ్య పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా.. హిందీలో మాట్లాడాలని ఆయన ప్రయత్నించారు. స్పీచ్ లో భాగంగా .. సారేజ‌హాసె అచ్చా పాట‌ను పాడబోయి నవ్వుల‌పాల‌య్యారు.

దేశభక్తి గీతం ‘సారే జహాసె అచ్చా.. ’ను ప్రస్తావిస్తూ ఆయన అన్న మాటలు వైరల్‌గా మారాయి. ‘సారా జహాసె అచ్చా.. ఏ బుల్ బుల్… ’ అని అన్నారాయన. తర్వాత అంతకు మించి పలకలేకపోయారు. పలికిన బుల్ బుల్ పదాలు కూడా తప్పుగా పలకడంతో ట్రోల్ బారిన పట్టారు.

సారే జహాసె అచ్ఛా
హిందుస్తాన్ హమారా

హమ్ బుల్ బులే హై ఇస్‌కే,
యే గుల్ సితా హమారా హమారా

అని ఉండగా బుల్ బులేను హే బుల్ బుల్ అని బాలయ్య పలికారు.

ఇక ఈ వీడియో అతి కొద్ది సేపట్లోనే మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వైరల్ వీడియోగా మారిపోయింది. ఈ వీడియోను కేటీఆర్‌ సైతం ఒత్తిడి నుంచి ఉపశమనం పొందే మరో శాంపుల్‌ అని ట్వీట్‌ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. బుల్‌బుల్‌ బాలయ్య అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ పడుతున్నాయి.