కేటీఆర్ “ముసలి నక్క, గుంట నక్క” భాషపై రేవంత్ కౌంటర్ (వీడియో)

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ  రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్దాలు పెరుగుతున్నాయి. ప్రత్యర్ది వ్యక్తి చేసిన మాటలకు డోస్ పెంచుతూ మరొకరు మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కేసీఆర్ బూతు భాషను వాడేవారు. ఇప్పుడు అదే బాటలో ఆయన తనయుడు కేటిఆర్ కూడా సభలల్లో మాట్లాడుతున్నారు. కాంగ్రెస్, చంద్రబాబు కలయికపై ఆయన ఘాటు వ్యాఖ్యలే చేశారు. ముసలి నక్క కాంగ్రెస్, గుంటనక్క చంద్రబాబు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై నర్సాపూర్ లో జరిగిన సభలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

నిన్న మొన్న వాడు కేటిఆర్ గాడు మాట్లాడుతూ కాంగ్రెస్, చంద్రబాబు కలయికపై మాట్లాడుతుండు. పందికి పరిశుభ్రత, గాడిదికి సంగీతం నేర్పగలమా.. అట్టనే ఈ కేటిఆర్ గానికి మనం ఏం నేర్పలేమంటూ విరుచుకుపడ్డారు. రేవంత్ కేటిఆర్ పై వాడు, వీడు, నక్క, పంది అంటూ డోస్ పెంచి మాట్లాడడంతో కార్యకర్తలంతా ఈలలతో హోరెత్తించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు సీఎం నుంచి విముక్తి చేయాలన్నారు.

నర్సాపూర్ లో జరిగిన కాంగ్రెస్ రోడ్ షోలో సునీతా లక్ష్మారెడ్డితో కలిసి రేవంత్ పాల్గొన్నారు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ది చేస్తానన్న కేసీఆర్ ఏ సమస్యను తీర్చలేదన్నారు. కేసీఆర్ కు ఏ సమస్య పట్టదని ఫాం హౌస్ లో కూర్చొని తాగడం ఒక్కటే తెలుసని ఎద్దేవా చేశారు. కేసీఆర్ దగ్గర గులాంగిరి చేసే మదన్ లాల్ కావాలో లేక అసెంబ్లీలో నర్సాపూర్ సమస్యల పరిష్కార కోరే సునీతా రెడ్డి కావాలో తేల్చుకోవాలన్నారు. కర్రుకాల్చి వాత పెట్టాల్సిన సమయం వచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి సభలో మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.

బంగారు తెలంగాణలో మెడలో పుస్తేల తాడు అమ్ముకోవాల్సి వచ్చిందని సునీత విమర్శించారు. జనం చచ్చారో బతికారో పట్టించుకోని కేసీఆర్ కు ఓటు వేయవద్దన్నారు. తన భర్త మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్నానని కానీ ప్రజల కోసం తిరిగి రాజకీయాలకు వచ్చానన్నారు. నర్సాపూర్ పౌరుషాల పోరుగడ్డ అని గుర్తు చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు.