రవితేజ కథానాయకుడిగా ‘ధమాకా’ లాంటి పెద్ద విజయాన్ని నమోదు చేసుకున్న దర్శకుడు నక్కిన త్రినాధరావు, ఇప్పుడు సందీప్ కిషన్ తో సినిమా చెయ్యడానికి సమాయత్తం అవుతున్నారు. ‘ఊరు పేరు భైరవకోన’ నిర్వాహకులు అయిన, ఏకె ఎంటర్ టైనమెంట్స్, రాజేష్ దందా మళ్ళీ సందీప్ కిషన్ తో ఈ సినిమా చేస్తూ ఉండటం విశేషం. ఇంతవరకు బాగానే వుంది, ఇందులో మరి దిల్ రాజు కి ఎందుకు కోపం అని అనుకుంటారేమో? నక్కిన త్రినాథ రావు తన ‘ధమాకా’ విజయం తరువాత నిర్మాత దిల్ రాజుకి సినిమా చెయ్యాలని అడ్వాన్స్ తీసుకున్నారు అని తెలిసింది. అయితే కథానాయకుడు ఎవరూ దొరకకపోవడంతో ఆ సినిమా అలా వాయిదా పడుతూ వస్తోంది. దిల్ రాజు తో సినిమా చేసిన తరువాత, నక్కిన తన తరువాత సినిమా చేసుకోవాలి.
కానీ ఇప్పుడు దిల్ రాజుతో సినిమా చెయ్యకుండానే సందీప్ కిషన్ తో, ఏకె ఎంటర్ టైన్మెంట్స్ కి చేస్తున్నారు. అయితే దిల్ రాజు ఇప్పుడు సైలెంట్ గా ఊరుకుంటారా, లేక ఏదైనా అడ్డుపుల్ల వేస్తారా అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఇదే దిల్ రాజు దర్శకుడు పరశురామ్ పెట్ల, విజయ్ దేవరకొండ తో సినిమా అధికారికంగా ప్రకటించినప్పుడు అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తనతో చెప్పకుండా దర్శకుడు పరశురామ్ దిల్ రాజు తో సినిమా చెయ్యడం వలన, అప్పుడు దిల్ రాజు, పరశురామ్ పై అరవింద్ గుర్ అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు దిల్ రాజు నక్కిన త్రినాథ రావుకి అడ్డుపుల్ల వెయ్యకుండా వుంటారా అని టాక్ నడుస్తోంది.
కానీ దిల్ రాజు ఇంతవరకు ఒకే చెప్పలేదని ఇంకో టాక్ నడుస్తోంది. నక్కిన త్రినాథ రావు ఒక పక్క దిల్ రాజుని ఒప్పించవచ్చు అని, ఇంకో పక్క ఏకె ఎంటర్ టైనమెంట్స్ అధినేత అనిల్ సుంకర కూడా దిల్ రాజు తో మాట్లాడుతారు అని ఇలా వినిపిస్తోంది, కానీ దిల్ రాజు ఒప్పుకున్నట్టు లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఇదే కథని రచయితే బెజవాడ ప్రసన్న కుమార్ చిరంజీవి కుమార్తె సుష్మితకి వినిపిస్తే అప్పట్లో చిరంజీవితో సినిమా చెయ్యాలని ఆమె ఈ కథని తీసుకున్నారు. ఆ సినిమా ఎందుకో కార్యరూపం దాల్చలేదు, కానీ సుష్మిత ఈ కథని మళ్ళీ ప్రసన్నకుమార్ కి ఇచ్చేశారా, లేక ఇక్కడ కథ కూడా అనధికారికంగా తీసేసుకున్నారా? అని ఇంకో టాక్. ఏమైనా నక్కిన, సందీప్ కిషన్ సినిమాపై చాలా క్లారిటీలు రావాల్సి వుంది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.