వేసవికాలం వచ్చింది అంటే చాలు, పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. మనకు వేసవికాలంలో ఎక్కడ చూసినా కూడా పెద్ద పెద్ద పుచ్చకాయలు లభిస్తూ ఉంటాయి. వేసవిలో ఈ పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా కలుగుతాయి. కొంతమంది పుచ్చకాయలు తిన్నప్పుడు వాటిలో విత్తనాలు బయట పడేస్తూ ఉంటారు. కొందరు ఆ విత్తనాలతో పాటు తింటూ ఉంటారు. వేసవిలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ప్రతిరోజూ పుచ్చకాయ పండును తినాలి. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది.. ఇది వేసవిలో అమృతఫలంగా పరిగణిస్తారు.
అయితే పుచ్చకాయను గింజలు లేకుండా తినడం ఎల్లప్పుడూ సాధ్యం కాదు. ఎందుకంటే పుచ్చకాయలో గింజలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది పుచ్చకాయతో పాటు గింజలను తింటుంటారు. చాలా సందర్భాలలో 3-4 గింజలు పండుతోపాటు నమిలేస్తారు. కొందరు మాత్రం పుచ్చకాయ గింజలు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెబుతూ ఉంటారు. మరి పుచ్చకాయ గింజలు తినవచ్చా తినకూడదా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ పదార్థాలు శరీరంలోని పోషకాహార లోపాలను పూరించడంతో పాటు బహుళ ప్రయోజనాలను అందిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
పుచ్చకాయ గింజల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని క్లియర్‌గా ఉంచడంలో సహాయపడుతాయి. అలాగే అకాల వృద్ధాప్యాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది పొడి చర్మం, దురద సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. పుచ్చకాయ గింజలు చర్మంపై మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. ప్రోటీన్ నుండి ఐరన్, జింక్, మెగ్నీషియం వరకు, ఈ పదార్థాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. పుచ్చకాయ గింజలు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అలాగే జుట్టు దెబ్బతినకుండా కాపాడతాయి. పుచ్చకాయ గింజలు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుండా పుచ్చకాయ గింజల్లో ఉండే మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఈ గింజలు శారీరక మంటను తగ్గిస్తాయి.