Summer Safety Tips: సమ్మర్ లో పిల్లల ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చేయాల్సిందే?

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతుందే తప్ప తగ్గడం లేదుాతావరణ అధికారులు వైద్యులు కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతూ వస్తున్నారు. కాబట్టి ఈ వేసవిలో బయటకు వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు చేసుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండగా రానున్న రోజుల్లో ఎండ వేడి మరింత పెరిగే ప్రమాదం ఉంది. సమ్మర్ హాలిడేస్ కావడంతో పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తుంటారు. అలాంటప్పుడు పిల్లలు ఎండ తీవ్రతకు ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామూలుగా నలభై డిగ్రీలు ఆపై ఉష్ణోగ్రతలు వల్ల వడగలు వస్తుంటాయి.

దీనివల్ల శరీరంపై ఉన్న స్వేద రంద్రాలు మూసుకుపోయి శరీరంలోని వేడి చెమట బయటకి రాకుండా ఉండిపోతాయి. దీంతో శరీరంలో వేడి తీవ్రమై మనిషి అస్వస్థతకు గురి కావ్వడం, స్పృహ కోల్పోవడం జరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందుకే అలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే ప్రాథమిక చికిత్స అవసరమని వైద్యులు చెప్తున్నారు. అయితే చిన్నపిల్లల్లో ఈ విషయంలో మరింత జాగ్రత్త వహించాలీ. ఐదేళ్ల లోపు చిన్నారులు చాలా సున్నితంగా ఉంటారు. తీవ్రమైన సూర్యరశ్మిని వారు తట్టుకోలేరు. ఎండలో చిన్న పిల్లలను బయట తిప్పడం వల్ల డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంది. దీంతో వాంతులు, విరోచనాలు ఏర్పడి వెంటనే డిహైడ్రేషన్ కి గురవుతారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ముప్పే. అందువల్ల అత్యవసర పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి తీసుకెళ్లడం బెటర్.

ముఖ్యంగా పిల్లలకు కాటన్ బట్టలు వేయడం, బయటికి వెళ్ళనీయకుండా చూడడం, పిల్లలు ఉండే గదులు చల్లగా ఉండేలా చూసుకోవడం మంచిది. నాలుగేళ్లలోపు పిల్లలకు సమ్మర్ లో ప్రతిరోజు 1 నుండి 1.5 లీటర్ల వరకు నీరు తాగించాలి. నాలుగు నుంచి తొమ్మిది యేళ్ల పిల్లలకు 1.5 నుండి 2 లీటర్ల నీరు తాగించాలి. పండ్ల రసాలతో డిహైడ్రేషన్ తీరదు. కనుక పిల్లలు హైడ్రేట్ కావడానికి కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ లాంటి ద్రవపదార్థాలు రెగ్యులర్‌గా ఇవ్వాలి. ముఖ్యంగా బయటికి వెళ్ళనివ్వకుండా ఇండోర్ గేమ్స్ ఆడిస్తూ ఆ ప్రాంతం చల్లగా ఉండేలా చూసుకోవాలి.