చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ విూడియాలో వైరల్‌గా మారుతోంది. భారీ సెట్‌లో యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. 26 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్‌లో ఇంటర్వెల్ ఫైటింగ్ సీన్స్‌ను చిత్రీకరించారు. ఇందుకోసం 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని రూపొందించారు. ఈ సన్నివేశం సినిమాకే అదనపు ఆకర్షణ కానుంది. యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో దీన్ని చిత్రీకరించారు. హైలెవెల్ వీఎఫ్‌ఎక్స్‌లతో ఫాంటసీ ప్రపంచాన్ని సృష్టించారు’ అని సినీ వర్గాల వెల్లడించాయి.
ఇటీవల హనుమాన్ విగ్రహం వద్ద చిరు దిగిన ఫొటోలు కూడా సోషల్ విూడియాలో వైరలైన సంగతి తెలిసిందే. ఇది సినిమాలో ఎలా ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోషియో ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ’విశ్వంభర’ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల కానుంది. 18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష ఈ సినిమా కోసం కలిసి నటిస్తుండడంతో దానిపై అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.
విజువల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యమిస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. దాదాపు రూ.200 కోట్ల భారీ బ్జడెట్‌తో దీన్ని తీర్చిదిద్దుతున్నట్లు టాక్. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక బ్జడెట్‌తో రూపొందుతున్న సినిమాగా ఇది నిలవనుంది. ఇక దీనిలో త్రిష ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు టాక్. ఆమెతో పాటు సురభి, ఇషాచావ్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.