ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేసి బాగా విసిగిపోయారు. ఎన్ని రోజులు చేసినా కూడా ఒకరి కిందకు పని చేయాల్సి వస్తోంది అన్న ఫీలింగ్ తో కొంతమంది జాబులకి రిజెక్ట్ చేసి సొంతంగా వ్యాపారం లేదంటే వ్యవసాయం లాంటివి చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. దానికి తోడు వచ్చే జీతం చాలీ చాలనంతగా ఉండటంతో పాటు ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు చాలామంది ఏదైనా కొత్తగా బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంటూ ఉంటే ఇప్పుడు మేము చెప్పబోయే బిజినెస్ ను స్టార్ట్ చేస్తే చాలు ఇంట్లో కూర్చొని బాగా డబ్బు సంపాదించుకోవచ్చు.
ఆ వ్యాపారం మరేదో కాదు బంగాళదుంప చిప్స్ తయారీ. కేవలం తక్కువ పెట్టుబడితో ఈ బిజినెస్ ద్వారా మంచి లాభాలు సంపాదించవచ్చు. ఇది ఎలాంటి రిస్క్ లేని బిజినెస్. పొటాటో చిప్స్ తయారీకి మీకు ఎలాంటి పెద్ద పెద్ద సామాగ్రి అవసరం లేదు. చిన్న చిన్న పరికరాలు చాలు. చిప్స్ తయారీకి మీకు కావాల్సిందల్లా బంగాళదుంపలు, నూనె, ఉప్పు, మసాలా, ముక్కలను కట్ చేసే కట్టర్, ఒక పెద్ద మూకుడు అంతే! ఆ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసిన తర్వాత అమ్మేందుకు చిన్న చిన్న కవర్లు. వీటిని మీ ఇంటి దగ్గరలోని హోల్‌సేల్ షాపుల్లో మంచి ధరకు అమ్మవచ్చు. ముడిసరుకుపై మీకు పడ్డ ఖర్చు కంటే ఎక్కువ లాభమే వస్తుంది.
సుమారు 10 కిలోల చిప్స్ అమ్మితే దాదాపుగా రూ. వెయ్యి లాభం వస్తుంది. ఇలా రోజుకు మూడు నుంచి మూడున్నర వెయ్యి వరకు సంపాదించవచ్చు. క్వాంటిటీ, క్వాలిటీ ప్రతీసారి సరిగ్గా చూసుకుంటే మీ సేల్స్ విపరీతంగా పెరుగుతాయి. లాభాలు కూడా రెట్టింపు అవుతాయి. ఈ విధంగా నెలకు 50 వేలకు పైన సంపాదించవచ్చు. అయితే బిజినెస్ ను స్టార్ట్ చేసే ముందు మీ ఏరియాలో దుకాణాల దగ్గరికి వెళ్లి మీ బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత చిప్స్ బిజినెస్ ని మొదలుపెట్టడం మంచిది.