వామ్మో…జీహెచ్ఎంసీ ఎన్నికలకి భలే ఎత్తుగడ వేస్తున్న కెసిఆర్ అండ్ టీం

kcr made master plan for GHMC elections

తెలంగాణ: టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి భారీ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ మహానగరంలో భారీ వరదల వల్ల ప్రజలు కష్టపడితే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మీద కేసీఆర్ స్పెషల్ ఫోకస్ చేశారు. గ్రేటర్‌లో మరోసారి గులాబీ జెండా ఎగరేసేలా తమ పట్టు నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ అధినేత ప్రయత్నాలు మొదలు పెట్టారు. అందుకోసం కేసీఆర్ ఎంచుకున్న మార్గం. యువత. పార్టీలో ఈసారి యువతను టార్గెట్‌గా చేసుకుని ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ డ్రైవ్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి డివిజన్‌లోనూ ఉత్సాహంగా, పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా ఉండే యువ నాయకులను ప్రోత్సహించాలని నిర్ణయించినట్టు కనిపిస్తోంది.

kcr made master plan for GHMC elections
kcr made master plan for GHMC elections

ఈ క్రమంలో కేసీఆర్ రెండు రోజుల క్రితం ప్రగతిభవన్‌లో టీఆర్ఎస్ యువనాయకత్వంతో చర్చించినట్టు తెలిసింది. పార్టీ కార్యక్రమాల్లో వారంతా చురుకుగా పాల్గొంటున్నారా? లేదా? అనే అంశాన్ని వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఫీల్డ్ లెవల్లో పార్టీ కార్యక్రమాలకు ఎప్పుడూ దూరం కావొద్దని సూచించారు. ఎవరైనా అలాంటి వారు ఉంటే తమ వైఖరి మార్చుకుని మళ్లీ యాక్టివ్ కావాలని ఆదేశించారు. అలాగే, ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న వారితో సుమారు ఆరు గంటల పాటు చర్చించినట్టు తెలిసింది. కేవలం కొద్దిసేపు కేసీఆర్‌తో సమావేశం ఉంటుందని భావించిన ఆ యువ కేడర్ ఆరు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడంతో టీఆర్ఎస్ యువ నాయకత్వంలో కొత్త ఉత్సాహం వచ్చిందని గులాబీ నేతలు చెబుతున్నారు.

ఈ ఏడాది నవంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగవచ్చని గతంలో కేటీఆర్ వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చాయి. అయితే, వాటిని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఖండించారు. జీహెచ్ఎంసీ ఎప్పుడంటే అప్పుడు తాము కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని చెప్పారు. అయితే, ఇటీవల వచ్చిన వరదలు టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గ్లోబల్ సిటీ గార్బేజ్ సిటీ అయిపోయిందంటూ ప్రతిపక్షాలు టీఆర్ఎస్ సర్కారు మీద విరుచుకుపడుతున్నాయి.